ASBL Koncept Ambience

పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ అత్యుత్తమం

పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ అత్యుత్తమం

ఆపిల్ సీవోవోతో చంద్రబాబునాయుడు

 

అమెరికా పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు  శనివారం ఆపిల్ కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రస్తుతం సుస్థిర వృద్ధి ఫలితాలు సాధిస్తూ భారతదేశం బలీయమైన దేశంగా ఎదిగిందని ఆపిల్‌ సీవోవోకు చంద్రబాబు వివరించారు. అలాగే భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని, దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ అత్యుత్తమమని చంద్రబాబు వివరించారు. వృద్ధి, అభివృద్ధి అంశాల్లో సరైన భాగస్వామ్యం కోసం అన్వేషిస్తున్నామని, ఏపీలో పెట్టుబడులు పెట్టి మాన్యుఫాక్చరింగ్‌ ఫెసిలిటీ ఏర్పాటు చేయండని ఆపిల్‌ సీవోవోను చంద్రబాబు కోరారు.

Tags :