ASBL Koncept Ambience

అమరావతి శంకుస్థాపనకు ఏర్పాట్లు

అమరావతి శంకుస్థాపనకు ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమం చరిత్రాత్మకంగా జరగబోతోంది. విజయదశమి పర్వదినాన తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెంలో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ నెల 18నాటికి శంకుస్థాపన పనులు అన్ని పూర్తి కానున్నాయి. సభ ప్రాంగణంలో లక్ష మంది కూర్చునేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. మరో 50, 60 వేల మంది ప్రజలు వచ్చినా ఇబ్బందులు పడకుండా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. లక్షన్నర మంది ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రధానంగా రోడ్‌ నెట్‌వర్కుపై దృష్టి కేంద్రీకరించారు. సభ ప్రాంగణంలో మొత్తం మూడు వేదికలు ఉంటాయి. ఒకదానిపై ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్‌, ఎంఐపీలు ఆశీసులవుతారు. దీనికి ఎడమ వైపున శంకుస్థాపన పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రధాన వేదికకు ఇరువైపులా వీవీఐపీలు ఆశీసులయ్యేందుకు రెండు వేదికలు కేటాయిస్నున్నారు. 22వ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు పూజ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 10 నుంచి 12 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, మధ్యాహ్న 12 గంటల నుంచి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఎంఐపీల ప్రసంగాలు, రైతులకు సత్కారాలు ఉంటాయి. 

కృష్ణానది కరకట్ట రోడ్డు పూర్తిగా ఎంఐపీలు( ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులు, చీఫ్‌ జస్టిస్‌, గవర్నర్‌లకు రిజర్వు చేశారు. కరకట్ట దిగువున ఉన్న రోడ్డుని ఏ, ఏఏ, ఏఏఏ పాస్‌లు కలిగిన వీఐపీలకు రిజర్వు చేశారు. భీష్మాచార్య రోడ్డలో వీఐపీలకు అనుమతిస్తారు. ప్రజల కోసం నాలుగు రోడ్లు విస్తరిస్తున్నారు. అమరావతి వైపు నుంచి వచ్చే వాహనాలు తుళ్లూరు వెళ్లకుండా బైపాసు రోడ్డు నుంచి మళ్లిస్తారు. ఉద్ధండరాయునిపాలెంలో శంకుస్థాపన వేదికకు 300 నుంచి 500 మీటర్ల దూరంలోనే పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు 22వ తేదీన ఉదయం 10గంటలోపే ప్రాంగణానికి చేరుకోవాలి. ప్రజలకు సభా ప్రాంగణంలో స్నాక్స్‌, టీ, మజ్జిగ, అరటికాయల సరఫరా చేయడంతో పాటు కార్యక్రమం ముగిసిన తర్వాత భోజన ప్యాకెట్లు అందజేయనున్నారు. 

 

Tags :