ASBL Koncept Ambience

నాట్స్ 5 వ అమెరికా తెలుగు సంబరాలకు ముమ్మరంగా సన్నాహాలు

నాట్స్ 5 వ అమెరికా తెలుగు సంబరాలకు ముమ్మరంగా సన్నాహాలు

తెలుగు సంస్కృతికి అద్దం పట్టేలా వసుదైక కుటుంబం

ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అమెరికాలో అంగరంగ వైభవంగా జరిగే తెలుగు సంబరాలు ఈ సారి చికాగో వేదికగా జరిపేందుకు నాట్స్ ఏర్పాట్లు చేస్తోంది. మరో రెండు రోజుల్లో ప్రారంభమయ్యే ఈ వేడుకల్లో ఈ సారి తెలుగు రాష్ట్రాల నుంచి అతిరథమహారథులు విచ్చేస్తున్నారు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సంబరాల్లో ప్రత్యేక ఆకర్షణగా మారనున్నారు. బన్నీతో పాటు డీజే టీం కూడా  సంబరాల్లో సందడి చేయనుంది. అమెరికాలో తొలిసారిగా నాట్స్ మూడు రోజుల పాటు మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.  తెలుగు సినీ గాయనీ గాయకులు హుషారైన పాటలతో... ఈ మ్యూజికల్ నైట్ సాగనుంది. జున్ 30 నుంచి జులై 2 వరకు  కన్నులపండువగా ఈ సంబరాలు జరగనున్నాయి.. వసుదైక కుటుంబం పేరుతో నాట్స్ సంబరాల టీం ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తోంది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం జరగనుంది.భాషే రమ్యం.. సేవే గమ్యం అని నినదించే  నాట్స్ దానికి తగ్గట్టుగానే ఈ సంబరాలు జరగనున్నాయి. అమెరికాలో తెలుగు వారంతా ఈ సంబరాలకు విచ్చేసి సంబరాల సంతోషాలను పంచుకోవాలని నాట్స్ పిలుపునిచ్చింది

అమెరికా తెలుగు సంబరాలకు సాహితీ ప్రముఖులు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ జూన్ 30 నుండి జులై 2 వరకు నిర్వహించనున్న అమెరికా తెలుగు సంబరాలకు తెలుగు రాష్ట్రాల నుంచి తెలుగు సాహితీ ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు. తెలుగు సంబరాల్లో భాగంగా నాట్స్ నిర్వహించే సాహితి ప్రముఖులు పాల్గొననున్నారు. ప్రముఖ కవి నామిని సుబ్రమణ్య నాయుడు, ప్రముఖ జర్నలిస్ట్ మల్లేపల్లి లక్ష్మయ్య, ప్రముఖ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు,సినీనటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణిలు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్. ప్రముఖ గజల్ గాయకులు గజల్ శ్రీనివాస్, సిలికానాంధ్ర ఫౌండర్&చైర్మన్ కూచిభొట్ల ఆనంద్, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ చైర్మన్ వీరమాచినేని దుర్గాభవాని ఈ సాహితీ సంబరాల్లో పాలుపంచుకోనున్నారు. తెలుగు భాషా, సాహిత్యంపై ఈ సంబరాల్లో చర్చ జరగనుంది.

నాట్స్ బాస్కెట్ బాల్ పోటీలకు విశేష స్పందన

అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి నాట్స్ నిర్వహించే తెలుగు సంబరాలకు సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగానే ముందస్తుగా స్థానిక తెలుగు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు నాట్స్ బాస్కెట్ బాల్ పోటీలను నిర్వహించింది. నేపర్విల్లె  లోని ఫోర్ట్ విల్ యాక్టివిటీ సెంటర్ లో హైస్కూలు స్థాయి బాస్కెట్ బాల్ పోటీలు జరిగాయి. చాలా మంది హైస్కూలు విద్యార్ధులు ఈ బాస్కెట్ బాల్ పోటీల్లో పాల్గొన్నారు. విజేతలకు నాట్స్ బహుమతులు అందించింది. అమెరికాలోని చికాగో.. శ్యాంబర్గ్ వేదికగా ఈ సారి తెలుగు సంబరాలు జరగనున్నాయి. జూన్ 30, జులై 1,2 తేదీల్లో జరిగే ఈ సంబరాలకు తెలుగు రాష్ట్రాల నుంచి అతిరథ మహారథులు విచ్చేస్తున్నారు

Click here for Event Gallery

Tags :