ASBL Koncept Ambience

ఆటా మహాసభలకు ఏర్పాట్లు ముమ్మరం.. ఆటా అధ్యక్షుడు భువనేష్ బుజాల

ఆటా మహాసభలకు ఏర్పాట్లు ముమ్మరం.. ఆటా అధ్యక్షుడు భువనేష్ బుజాల

అమెరికా తెలుగు సంఘం (ఆటా) వాషింగ్టన్‌డీసిలో జూలై 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించనున్న 17వ ఆటా మహసభలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. వాల్టర్‌ ఇ వాషింగ్టన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే ఈ వేడుకలకోసం ఇప్పటికే ఏర్పాట్లను పెద్దఎత్తున చేస్తున్నారు. కోవిడ్‌ కారణంగా రెండేళ్ళలో ఏ విధమైన భారీ కార్యక్రమం అమెరికాలో జరగలేదని, కోవిడ్‌ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ మహాసభలను తాము పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు చేస్తున్న ప్రకటనలు, మహాసభలకు వస్తున్నవారి వివరాలు తెలుసుకుని ఇప్పటికే పలువురు తాము ఆటా మహాసభలకోసం వాషింగ్టన్‌డీసి వచ్చి అక్కడ సమ్మర్‌ ఎంజాయ్‌ చేస్తామని చెబుతున్నట్లు ఆటా అధ్యక్షుడు భువనేష్‌ బుజాల తెలిపారు. దీంతో తాము ఊహించినదానికన్నా పదివేలమందికిపైగా జనం హాజరవుతారని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. తాము కూడా పెద్దఎత్తున జనం హాజరవుతారనే ఉద్దేశ్యంతోనే అందుకు తగ్గట్టుగా విందు, వసతి సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామని కూడా వివరించారు.

కమిటీల నియామకం

ఆటా మహాసభలను పెద్దఎత్తున నిర్వహించేం దుకు వీలుగా కమిటీలను కూడా నియమించామని, దాదాపుగా 65 కమిటీలను ఏర్పాటు చేశామని, 350 మంది కమిటీల్లో సభ్యులుగా ఉన్నారని చెప్పారు. వీరంతా ఆటా కన్వెన్షన్‌ విజయవంతంకోసం విస్తృతంగా కృషి చేస్తున్నారని చెప్పారు. కాన్ఫరెన్స్‌ అడ్‌హాక్‌ కమిటీ, కోర్‌ కమిటీ, కాన్ఫరెన్స్‌ అడ్వయిజరీ కమిటీ, కో`హోస్ట్‌ కమిటీలు ఓవరాల్‌గా ఏర్పాట్లను చూస్తోందని, దీంతోపాటు వివిధ కార్యక్రమాలకోసం మరికొన్ని కమిటీలను ఏర్పాటు చేశామని, ఈ కమిటీల్లో కూడా తాము ఒక్కొక్క అంశానికి ఒక్కో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కల్చరల్‌ కోసం సాధారణంగా ఓకమిటీనే ఉంటుంది. కాని మేము ఈ కల్చరల్‌ కార్యక్రమాన్ని 4 అంశాలుగా విభజిం చాము. కల్చరల్‌-బాంక్వెట్‌, కల్చరల్‌ - ఇనాగురల్‌, డే, కల్చరల్‌ - డే కార్యక్రమాల పేరుతో ప్రత్యేకంగా విభజించి కమిటీ సభ్యులను నియమిం చాము. హాస్పిటాలిటీ కమిటీని కూడా విభజించి హాస్పిటా లిటీ సూట్స్‌ అండ్‌ అదర్స్‌, హాస్పిటాలిటీ మెయిన్‌, హాస్పిటాలిటీ - వెల్‌కమ్‌ ప్యాకేజీ, హాస్పిటాలిటీ - పొలిటీషియన్స్‌, హాస్పిటాలిటీ ` సినీ ఆర్టిస్ట్స్‌ పేరుతో విభజించి వాటికి కూడా ప్రత్యేకంగా సభ్యులను నియమించాము. పొలిటికల్‌ కమిటీని కూడా ఆంధ్రకు ప్రత్యేకంగా, తెలంగాణకు ప్రత్యేకంగా, అమెరికాకు ప్రత్యేకంగా కమిటీలు ఉండేటట్లుగా విభజించి సభ్యులను నియమించాము. ఫుడ్‌కమిటీని కూడా విభజించాము. ఫుడ్‌ - డోనర్స్‌, ఫుడ్‌ - నాన్‌ డోనర్స్‌, ఫుడ్‌ - బాంక్వెట్‌ ఇలా విభజించాము. ముఖ్యమైన కమిటీలను ఇలా విభజించడం వల్ల ఎవరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండాలన్న ఉద్దేశ్యంతోనే చేశాము. ఇలా ఇంతమందితో కమిటీలను ఏర్పాటు చేసి ఈ మహాసభలను పెద్దఎత్తున నిర్వహిస్తున్నాము. దీంతోపాటు అలూమ్ని, ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌, ఎవి-ఆడియో-వీడియో, అవార్డ్స్‌, బాంక్వెట్‌, బాంక్వెట్‌ స్టేజ్‌, బడ్జెట్‌, బిజినెస్‌ సెమినార్స్‌, యుఎస్‌ డిగ్నిటరీస్‌-కో ఆర్డినేషన్‌, సిఎంఇ, కార్పొరేట్‌ స్పాన్సర్‌ షిప్‌, కమ్యూనిటీ రీచ్‌, డెకరేషన్స్‌, ఫిలిం అండ్‌ ఫోటోగ్రపీ, ఫైనాన్స్‌ అండ్‌ ఫండ్‌ రైజింగ్‌, రిజిస్ట్రేషన్‌, జుమ్మందినాదం, లిటరరీ, ఇమ్మిగ్రేషన్‌ ఫోరం, ఇన్విటేషన్‌ అండ్‌ ట్రావెల్‌, మెట్రిమోనియల్‌, మీడియా అండ్‌ కమ్యూనికేషన్స్‌, నైబరింగ్‌ సిటీ కో ఆర్డినేషన్‌, ఎన్నారై, ఓవర్సీస్‌ కో ఆర్డినేషన్‌ ` ఎపి, ఓవర్సీస్‌ కో ఆర్డినేషన్‌ ` టిఎస్‌, ప్రోగ్రామ్స్‌ అండ్‌ ఈవెంట్స్‌, పబ్లిసిటీ, రిసెప్షన్‌, రిజిస్ట్రేషన్‌, సెక్యూరిటీ, సెక్యూరిటీ `సీటింగ్‌, సీనియర్‌ సిటిజన్‌ ఫోరం, సైట్‌ సీయింగ్‌, సావెనీర్‌, ఆధ్యాత్మికం, ఆధ్యాత్మికం-టీటిడి కళ్యాణం, స్పోర్ట్స్‌, స్టేజ్‌ కో ఆర్డినేషన్‌, బ్యాక్‌ స్టేజ్‌ కో ఆర్డినేషన్‌, సై అండ్‌ పాదం, ట్రాన్స్‌పోర్టేషన్‌, వెండర్‌ (బూత్స్‌), వెండర్‌ సర్వీసెస్‌, వెన్యూ, వలంటీర్‌, వెబ్‌, ఉమెన్స్‌ ఫోరం, యూత్‌ ఫోరం, మెమెం టోస్‌, షాల్వ్స్‌, ప్రోగ్రామ్‌ గైడ్‌, టెక్నాలజీ, నార్త్‌ వెస్ట్‌ రీజియన్‌ కాన్ఫరెన్స్‌ కమిటీ, ప్రెసిడెన్షియల్‌ అడ్వయిజరీ టీమ్‌ వంటి కమిటీలను ఈ కాన్ఫరెన్స్‌ కోసం ఏర్పాటు చేశారు.

ఆటా మహాసభలకు ఇళయరాజా ప్రత్యేక ఆకర్షణ : ఆటా అధ్యక్షుడు భువనేష్‌ బుజాల

ఆటా మహాసభలకోసం ఎంతోమంది ప్రముఖులను ఆహ్వానించినట్లు భువనేష్‌ బూజాల తెలిపారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారీస్‌ను మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామని, దీనికి సంబంధించి ఆమె కార్యాలయం నుంచి మంచి స్పందన కనిపించిందని ఆయన చెప్పారు. అలాగే సినీరంగంలో అగ్రశ్రేణి సంగీత దర్శకుడైన ఇళయరాజా ఈ ఆటా మహాసభల్లో సంగీత కచేరీ చేయబోతున్నారని ఇది హైలైట్‌గా నిలుస్తుందన్నారు. అలాగే ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గి వాసుదేవ్‌ ప్రత్యేక ఉపన్యాసం, మీట్‌ అండ్‌ గ్రీట్‌ ఉంటుందని తెలిపారు.

అమెరికాలో భారత రాయబారిగా ఉన్న తరణ్‌జిత్‌ సింగ్‌ సంధు, కేంద్రమంత్రి జి. కిషన్‌ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, టీటీడి చైర్మన్‌, ఎంపి వై.వి. సుబ్బారెడ్డి తదితరులు వస్తున్నారని, ఆధ్యాత్మికవేత్త కమలేష్‌ డి పటేల్‌, అలాగే సాహిత్యరంగం నుంచి నందినీ సిదారెడ్డి, తనికెళ్ళ భరణి, సినీరంగం నుంచి నందమూరి బాలకృష్ణ, అల్లరి నరేష్‌, మంచు విష్ణు, శివబాలాజీ, రవి మాదాల, రామ్‌ మిర్యాల, సాయికుమార్‌, ఆది సాయికుమార్‌ తదితరులు వస్తున్నారని తెలిపారు. ఈ కన్వెన్షన్‌కు 10వేలమందికిపైగా వస్తున్నందున రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు, జ్యూవెల్లరీ, దుస్తుల కంపెనీలకోసం ప్రత్యేక స్టాల్స్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నామని కూడా భువనేష్‌ పేర్కొన్నారు.

ఈ మహాసభలకు సంబంధించి ఇతర వివరాల కోసం ఎప్పటికప్పుడు మహాసభల వెబ్‌సైట్‌ను చూడాల్సిందిగా ఆయన కోరారు.

www.ataconference.org

 

Tags :