టిటిఏ మెగా కన్వెన్షన్ కు అంతా సిద్ధం
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) మెగా కన్వెన్షన్‌కు అంతా సిద్ధమైంది. మూడురోజులపాటు జరిగే పండుగకు సియాటెల్ నగరం ముస్తాబైంది. మే 24 నుంచి 26వ తేదీ వరకు జరిగే ఈ మెగా కన్వెన్షన్ కోసం టిటిఎ నాయకులు అన్నీ ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ మెగా కన్వెన్షన్‌కోసం ఆరు నెలల క్రితం నుంచే టిటిఎ నాయకులు తగిన ప్రణాళికలతో, కమిటీల ఏర్పాటుతో రంగాన్ని సిద్ధం చేస్తూ వచ్చారు. టిటిఎ ఫౌండర్ పైళ్ళ మల్లారెడ్డి ఆధ్వర్యంలో టిటిఎ నాయకులు అన్నీ నగరాల్లో ప్రచార కార్యక్రమాలను, ఫండ్ రైజింగ్ ఈవెంట్స్‌లను నిర్వహించారు.
వివిధ టీమ్‌లు, కమిటీల నియామకం
ఈ మెగా కన్వెన్షన్ కోసం పెద్దలతో మూడు టీమ్‌లను ఏర్పాటు చేసి అన్నీ పనులు సజావుగా జరిగేలా చూశారు. కన్వెన్షన్ అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఫౌండర్ డా. పైళ్ళ మల్లారెడ్డి, అడ్వయిజరీ కమిటీ చైర్ డా. విజయ్‌పాల్ రెడ్డి, అడ్వయిజరీ కమిటీ కో చైర్ డా. మోహన్ రెడ్డి పాటలోళ్ళ, కమిటీ సభ్యునిగా భరత్ రెడ్డి మాదాడి, ప్రెసిడెంట్ వంశీ రెడ్డి కంచరకుంట్ల ఉన్నారు.
కన్వెన్షన్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ప్రెసిడెంట్ వంశీరెడ్డి కంచరకుంట్ల, కన్వీనర్ చంద్రసేన శ్రీరామోజు, ప్రెసిడెంట్ ఎలక్ట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కో కన్వీనర్ గణేశ్ మాధవ్ వీరమనేని, కో ఆర్డినేటర్ మాణిక్యం తుక్కాపురం, కో కో ఆర్డినేటర్ మనోహర్ బోడ్కె, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డా. నరసింహారెడ్డి దొంతిరెడ్డి (ఎల్‌ఎన్), జనరల్ సెక్రటరీ కవితారెడ్డి, ట్రెజరర్ సహోదర్ రెడ్డి పెద్దిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా. దివాకర్ జంధ్యం, జాయింట్ సెక్రటరీ శివారెడ్డి కొల్లా, నేషనల్ కో ఆర్డినేటర్ ప్రదీప్ మెట్టు, ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ కూనరపు, నేషనల్ ఇంటర్నేషనల్ ఎఫైర్స్ కో ఆర్డినేటర్ సురేష్ రెడ్డి వెంకన్నగరి, బోర్డ్ డైరెక్టర్ ఉషారెడ్డి మన్నెం ఉన్నారు. కన్వెన్షన్ రీజినల్ అడ్వయిజర్లుగా నవీన్ గోలి, మనోజ్ చింతిరెడ్డి, అనిల్ ఎర్రబెల్లి, డా. ద్వారకనాథ్ రెడ్డి ఉన్నారు.
కన్వెన్షన్ పెద్దఎత్తున నిర్వహిస్తున్నందున ఈ కార్యక్రమాల విజయవంతం వివిధ కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. బాంక్వెట్ కమిటీకి చైర్‌గా ప్రియాంక కృష్ణ, బ్యూటిపెజియంట్ కమిటీకి అనిలకామసాని, బడ్జెట్ అండ్ ఫైనాన్స్ కమిటీకి చైర్‌గా రవీందర్ వీరవల్లి, బిజినెస్ ఫోరం కమిటీకి చైర్‌గా సంతోష్ గంటారాం, సిఇ,సిఎంఇ కమిటీ చైర్‌గా నందిని సుంకిరెడ్డి ఉన్నారు. కార్పొరేట్ స్పాన్సర్ షిప్ కమిటీకి చైర్‌గా జైపాల్ రెడ్డి దొడ్డ, కల్చరల్ కమిటీకి చైర్‌గా సంగీతా రెడ్డి, డెకరేషన్ కమిటీ చైర్‌గా కృష్ణారెడ్డి కోటపాటి, ఫుడ్ కమిటీ చైర్‌గా హరి కాటుకూరి, ఫండ్ రైజింగ్ కమిటీ చైర్‌గా ప్రదీప్ మెట్టు, హాస్పిటాలిటి, రిసెప్షన్ కమిటీ చైర్‌గా రవీందర్ రెడ్డి సాధు, ఇమ్మిగ్రేషన్ ఫోరం కమిటీ చైర్‌గా అహ్లాద్ కారెడ్డి, ఐటీ ఇన్‌ఫ్రా కమిటీ చైర్‌గా పార్థసారధి వెలదండి, మ్యాట్రిమోనియల్ కమిటీ చైర్‌గా ఉమారెడ్డి, మీడియా అండ్ కమ్యూనికేషన్స్ చైర్‌గా మధుబాబు మల్లిడి, ఓవర్సీస్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్‌గా ప్రదీప్ బొద్దు, పొలిటికల్ ఫోరం కమిటీ చైర్‌గా దుర్గా ప్రసాద్ సెలోజ్, ప్రోగ్రామ్స్ అండ్ ఈవెంట్స్ కమిటీ చైర్‌గా సందీప్ కుమార్ భూషణం, పబ్లిక్ రిలేషన్స్, పబ్లిసిటీ కమిటీ చైర్‌గా ప్రసాద్ సేనాపతి, రిజిస్ట్రేషన్ అండ్ రిసెప్షన్ కమిటీ చైర్‌గా శివ వెదురుపాటి, సేఫ్టి అండ్ సెక్యూరిటీ కమిటీ చైర్‌గా కేశవ్ రెడ్డి బొమ్మినేని, షార్ట్ ఫిలిం కమిటీ చైర్‌గా దీప్తి మిర్యాల, సోషల్ మీడియా కమిటీ చైర్‌గా దీపికారెడ్డి నల్ల, లిటరరీ, సావనీర్ కమిటీ చైర్‌గా శ్రీనివాస్ గూడురు, ఆధ్యాత్మికం కమిటీ చైర్‌గా మంజునాథ్ బేసాటి, స్టేజ్, ఎవి కమిటీ చైర్‌గా సునీల్ కుమార్ నారాయణ చెట్టి, స్టార్టప్ క్యూబ్ కమిటీ చైర్‌గా శ్రావణి వట్టి, ట్రాన్స్‌పోర్టేషన్ కమిటీ చైర్‌గా మధు రెడ్డి, టిటిఎ స్టార్ కమిటీ చైర్‌గా భాస్కర్ బండి, వెండర్ అండ్ ఎగ్జిబిట్స్ కమిటీ చైర్‌గా నవీన్ ఓరుగంటి, వెన్యూ కమిటీ చైర్‌గా భరత్ రెడ్డి చూలుపూరి, వలంటీర్ కమిటీ చైర్‌గా పవన్ రెడ్డి నూకల, వెబ్ కమిటీ చైర్‌గా జితేంద్ర రెడ్డి తిప్పుగారి, ఉమెన్స్ ఫోరం కమిటీ చైర్‌గా డా. వాణి గడ్డం, యూత్ ఫోరం కమిటీ చైర్‌గా అనీలకామసాని, యూత్ ఎంట్రప్రెన్యూర్ జెన్ ఎఐ కమిటీ చైర్‌గా అవినాష్ కొల్లూరి, యూత్ ఎంట్రప్రెన్యూర్ స్టార్టప్ కమిటీ చైర్‌గా కిరణ్ కాకి ఉన్నారు.
ప్రముఖులకు ఆహ్వానం
సియాటెల్‌లో జరగనున్న టీటీఏ మెగా కన్వెన్షన్‌లో పాల్గొనాల్సిందిగా పలువురు ప్రముఖులను ఇండియాకు వచ్చినప్పుడు టిటిఎ ప్రతినిధులు స్వయంగా కలిసి ఆహ్వానించారు. టీటీఏ ప్రెసిడెంట్ వంశీరెడ్డి కంచరకుంట్ల, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, కన్వెన్షన్ రీజనల్ అడ్వైజర్స్ డాక్టర్ ద్వారకానాథ రెడ్డి, నవీన్ గోలి, సీఈసీ ఈవీపీ డాక్టర్ ఎల్‌ఎన్ రెడ్డి దొంతిరెడ్డితోపాటు ఈసీ, బీవోడీ జ్యోతిరెడ్డి దూదిపాల, బీవోడీ దుర్గాప్రసాద్ సెలోజ్ తదితరులు కలిసి టీటీఏ మెగా కన్వెన్షన్‌లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్, తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులను ఈ వేడుకకోసం వారు ఆహ్వానించారు.
వివిధ కార్యక్రమాలు
మెగా కన్వెన్షన్‌ను పురస్కరించుకుని పలు కార్యక్రమాలను కల్చరల్ కమిటీ చైర్ సంగీతా రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించారు. ఇండియా పెరెడ్ పేరుతో ఓ కార్యక్రమాన్ని రూపొందించారు. ఇండియాలోని వివిధ రాష్ట్రాల్లో జరిగే కవాతు కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం ద్వారా ప్రదర్శించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా మెయిన్ స్టేజ్ నుంచి ఊరేగింపును, రెండు దేశాల జాతీయ గీతాలాపనతో, తెలంగాణ గీతంతో కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ కన్వెన్షన్‌కోసం స్వాగత గీతాన్ని ప్రముఖ సాహితీవేత్త వడ్డేపల్లి కృష్ణ రాయగా, వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్ని సమకూర్చారు. తెలంగాణ జానపద నృత్యాలకు ప్రాధాన్యం ఇచ్చారు. యూత్ ఫ్యాషన్ షో వంటివి కార్యక్రమాల్లో ముఖ్యమైనవి.
సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు, మహిళా కార్యక్రమాలు, చిన్న పిల్లలలకోసం ప్రత్యేక కార్యక్రమాలు, యూత్ కార్యక్రమాలు, సిఎంఇ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, టెక్నాలజీ, బిజినెస్, ఇతర రంగాలకు సంబంధించిన కార్యక్రమాలను కూడా ఈ మూడురోజుల కన్వెన్షన్ కార్యక్రమాల్లో చూడవచ్చు. ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ సంగీత విభావరి, హైదరాబాద్‌కు చెందిన త్రీయరీ బ్యాండ్ వారితో సంగీత కచేరీని ఏర్పాటు చేశారు. లైవ్ కన్సర్ట్‌లో హైదరాబాద్‌కు చెందిన కళాకారులు తమ పాటలతో, సంగీతంతో అందరికీ ఉల్లాసాన్ని కలిగించనున్నారు.
సిఎంఇ
కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సిఎంఇ) కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. కీ నోట్ స్పీకర్‌గా డాక్టర్ మలిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి (ఎం.ఎస్. రెడ్డి) మాట్లాడనున్నారు. కోవిడ్, ఇతర వైరల్ ఇన్‌స్పెక్షన్స్‌కు సంబంధించిన విషయాలపై ఆయన ప్రసంగించనున్నారు. డాక్టర్ సంతోష్ రెడ్డి కూడా హార్ట్ డిసీస్, కార్డియాక్ డెత్ విషయంపై మాట్లాడనున్నారు. డాక్టర్ కళ్యాణ్ రెడ్డి కన్‌ప్యూజన్ ఇన్ ఎల్డర్లీ మేనెజ్‌మెంట్‌పై, డాక్టర్ నందిని సుంకిరెడ్డి న్యూ అడ్వాన్సెస్ ఇన్ ఒబేసిటీ మెడిసిన్‌పై ప్రసంగించనున్నారు. డాక్టర్ ప్రతిమా ప్రొద్దుటూరి బ్రెస్ట్ క్యాన్సర్, ఎర్లీ డిటెక్షన్ సేవ్స్ లైవ్స్ పై మాట్లాడనున్నారు. డాక్టర్ రాజ సప్పాటి, కొలాన్ క్యాన్సర్ సంబంధిత విషయంపై, డాక్టర్ సుమన్ మంచిరెడ్డి ఆప్టిమల్ హెల్త్ అండ్ లాంగెవిటిపై ప్రసంగించనున్నారు. ఈ సిఎంఇ కార్యక్రమ కమిటీకి డాక్టర్ నందిని సుంకిరెడ్డి చైర్‌గా వ్యవహరిస్తున్నారు.
అష్టావధానం
మెగా కన్వెన్షన్ కార్యక్రమాల్లో భాగంగా సాహితీ ప్రియులకోసం అష్టావధానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సంస్కృతాంధ్ర ద్విశతావధాని, అవధాన బ్రహ్మఙ శ్రీ పాలడుగు శ్రీచరణ్ అష్టావధానాన్ని మే 25వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సభా సంచాలకులుగా సినీనటులు, దర్శకులు, గీత రచయిత డా. వడ్డేపల్లి కృష్ణ వ్యవహరిస్తున్నారు. వృచ్ఛకులుగా తల్లాప్రగడ రామచంద్రరావు, శ్రీమతి మాధురి ఇంగువ, మల్లిక్ బులుసు, సందీప్ పొక్కునూరి, డా. కొండపల్లి నీహారిణి, శ్రీనివాస్ గూడురు, శ్రీమతి రాజేశ్వరి బుర్రా, సుధాకర్ ఉప్పల ఉన్నారు. లిటరరీ, సావనీర్ కమిటీ చైర్ శ్రీనివాస్ గూడురు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. సియాటెల్‌లో మే 24 నుంచి 26 వరకు టిటిఎ మెగా కన్వెన్షన్ జరుగుతున్న సంగతి తెలిసిందే.
టిటిఎ వివాహ వేదిక
అమెరికాలో ఉంటున్న తెలుగువారికోసం తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) ఆధ్వర్యంలో మెగా కన్వెన్షన్ కార్యక్రమాల్లో భాగంగా వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా తల్లితండ్రుల సమావేశం, సింగిల్స్ మీట్ వంటివి ఏర్పాటు చేశారు. టిటిఎ మేట్రిమోనియల్ కమిటీకి చైర్‌గా ఉమా గడ్డం వ్యవహరిస్తున్నారు.
పరంపర సాంస్కృతిక ప్రదర్శనలు
* మన సంప్రదాయ నృత్యవైభవాన్ని, మన సంస్కృతిని తెలియజేసే కార్యక్రమాలను ప్రదర్శించడంలో పేరుగాంచిన పరంపర టీమ్ వారు ఈ మెగా కన్వెన్షన్‌లో కూడా తమ సంప్రదాయ నృత్య వైభోగాన్ని చాటి చెప్పనున్నారు.
* టిటిఎ బిజినెస్ ఫోరం ఆధ్వర్యంలో ఎంట్రప్రెన్యూరల్ ఛాలెంజెస్ ఫర్ సక్సెస్ పేరుతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. యూప్ టీవి ఫౌండర్, సిఇఓ ఉదయ్ రెడ్డి ఇందులో ప్రసంగించనున్నారు.
* టిటిఎ ఉమెన్స్ ఫోరం ఆధ్వర్యంలో కూడా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్యానల్ డిస్కషన్స్, అవార్డులు, ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
* యూత్ కోసం ప్రత్యేక కార్యక్రమాలను మెగా కన్వెన్షన్‌లో నిర్వహిస్తున్నారు. ఇలా ఎన్నో కార్యక్రమాలను టిటిఎ మెగా కన్వెన్షన్‌లో ఏర్పాటు చేశారు.
* అలాగే మెగా కన్వెన్షన్ సందర్భంగా వివిధ పోటీలను కూడా నిర్వహించారు. టీటిఎ రీల్స్ కాంటెస్ట్, బ్యూటీ పేజియంట్, చిత్రం భళారే విచిత్రం పేరుతో షార్ట్ ఫిలిం పోటీలు, టిటిఎ స్టార్ వంటి పోటీలను ఏర్పాటు చేశారు.