అందరికీ ఆప్తుడు అశోక్‌బాబు కొల్లా...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో స్టూడెంట్ లీడర్‌గా చేరి, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నేడు తానా సహాయ కోశాధికారి పదవికి పోటీ పడుతున్న అశోక్‌బాబు కొల్లాకు అందరిలోనూ మంచి ఇమేజ్ ఉంది. ప్రకాశం జిల్లాకు చెందిన అశోక్ బాబు కొల్లా 2007లో అమెరికాకు వచ్చి కెంటకీలోని ముర్రే స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశారు. 2008లో యూనివర్సిటీ అంతర్జాతీయ విద్యార్థుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికై లీడర్‌షిప్ ప్రతిభను కనబరిచారు. 2009లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నిర్వహిస్తున్న కార్యకలాపాలపై ఆకర్షితుడై 2009లో తానాలో ప్రవేశించారు. అనతికాలంలోనే నాయకులకు కావాల్సిన వ్యక్తిగా ఎదిగాడు. తానాలో విద్యార్థి విభాగానికి అశోక్ సమన్వయకర్తగా పనిచేసి, భారతీయ విద్యార్థులు ఎదుర్కొన్న సంక్షోభాల్లో వారి సమస్య పరిష్కారానికి తానా తరపున రంగంలో దిగి అందరి దృష్టిని ఆకర్షించారు.
అమెరికాలోని తెలుగు విద్యార్థుల సమస్యల పరిష్కారంలో ఎప్పుడూ ముందుండే అశోక్ తరువాత కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో కూడా చురుకైన పాత్రను పోషించారు. తానా తరపున వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను అటు అమెరికాలోనూ ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో నిర్వహించారు. ఆరోగ్య అవగాహన, వైద్య శిబిరాలు, ఎన్నారై స్టూడెంట్ రిలేషన్స్ ప్రాజెక్ట్, రీజినల్ ఫుడ్ బ్యాంక్ ద్వారా అన్నదానం, ప్రాచీన విలువిద్య ప్రదర్శనను అమెరికాలో ఏర్పాటు చేసి మన గొప్పదనాన్ని చాటడం, కూచిపూడి వర్క్‌షాప్ వంటివి నిర్వహించడం చేశారు. తానా సర్వీసెస్ డే రోజున 2,500 మంది చిన్నారులకు పెద్ద సంఖ్యలో ఆహారపొట్లాలను పంపిణీ చేసి అక్రోన్ నగర మేయర్ అభినందనలను కూడా అందుకున్నారు. కెంటకీ, ఒహాయో రాష్ట్రాల గవర్నర్‌ల ప్రశంసలతోపాటు కమ్యూనిటీ పెద్దల ఆశీర్వాదాలను కూడా అందుకున్నారు.
తానాలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నేడు తానా సహాయ కోశాధికారి పదవికి పోటీ పడుతున్నాడు.