ASBL Koncept Ambience

తానా ట్రెజరర్ పదవికి పోటీ పడుతున్న అశోక్‍బాబు కొల్లా

తానా ట్రెజరర్ పదవికి పోటీ పడుతున్న అశోక్‍బాబు కొల్లా

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 2021 ఎన్నికల్లో తానా ట్రెజరర్‍ పదవికి అశోక్‍బాబు కొల్లా పోటీ పడుతున్నారు. తానాలో వివిధ పదవులను అలంకరించిన అశోక్‍బాబు కొల్లా కమ్యూనిటీకి తనవంతుగా సేవలందించారు. ప్రస్తుతం తానా జాయింట్‍ సెక్రటరీగా, తానా టీమ్‍స్క్వేర్‍ చైర్మన్‍గా కూడా పనిచేస్తున్నారు. అంతకుముందు ఎగ్జిక్యూటివ్‍ కమిటీలో జాయింట్‍ ట్రెజరర్‍ (2017-19)గా, కల్చరల్‍ కో ఆర్డినేటర్‍(2015-17)గా, తానా టీమ్‍స్క్వేర్‍ కో చైర్‍గా కూడా పని చేశారు. దీంతోపాటు వివిధ పదవులను కూడా ఆయన నిర్వహించారు.

కమ్యూనిటీకి చేసిన సహాయం

* తానా టీమ్‍స్క్వేర్‍ ద్వారా వివిధ సంఘటనల్లో కష్టాలపాలైన వేలాదిమందికి సహాయం

* అక్రాన్‍-కాంటన్‍ రీజినల్‍ ఫుడ్‍బ్యాంక్‍కు 500,000 భోజన ప్యాకెట్ల విరాళం

* ఫేక్‍ స్కూల్స్ వల్ల నష్టపోయిన దాదాపు 10,000 మంది భారతీయ విద్యార్థులకు సహాయం

* కోవిడ్‍ సమయంలో ఇండియన్‍ స్టూడెంట్స్ కు నిత్యావసర వస్తువుల పంపిణీ

* అమెరికాలో లాక్‍ డౌన్‍ కారణంగా చిక్కుకుపోయిన భారతీయ కుటుంబాలకు చెందిన తల్లితండ్రులు దాదాపు 2500 మందికి విమాన టిక్కెట్లు ఇవ్వడం ద్వారా వారిని స్వదేశానికి పంపించడం

* ఆంధప్రదేశ్‍లోని పేద విద్యార్థుల కార్డియాక్‍ సర్జరీలకు సహాయపడటం

* ప్రకాశం జిల్లాలోని గురుకులం పాఠశాలలోని 300 మంది బాలికలకు మళ్ళీవాడుకునే శానిటరీనాప్‍కిన్స్ పంపిణీ. అమెరికాలో దీనిని ప్రత్యేకంగా తయారు చేయించారు.

* గుంటూరు జిల్లాలోని తుళ్ళూరులో ఉన్న 200 మంది చిన్నారులకు సంవత్సరంపాటు అక్షయపాత్ర ఫౌండేషన్‍తో కలిసి భోజనం సరఫరా

* ఆంధ్ర, తెలంగాణ రూరల్‍ ప్రాంతంలో ఉన్న 4,500 మంది చిన్నారులకు హెపటైటిస్‍ బి వ్యాక్సిన్‍ ఉచిత పంపిణీ

* ప్రాచీన విలువిద్యను అమెరికా అంతటా 11 పెద్ద నగరాల్లో ప్రదర్శనల ఏర్పాటు

* గుంటూరులో గ్రేస్‍ ఫౌండేషన్‍తో కలిసి గిన్నిస్‍ రికార్డు సృష్టించేలా దాదాపు 3000 మంది మహిళలకు క్యాన్సర్‍ పరీక్షలు.

* విశాఖపట్టణంలో మంజుభార్గవితో కూచిపూడి వర్క్ షాప్‍ నిర్వహణ

* ఒహాయో స్థానిక నాయకుల సహకారంతో తానా ఆధ్వర్యంలో యుఎస్‍ క్యారమ్స్ టోర్నమెంట్‍, లేడీస్‍ క్రికెట్‍ టోర్నమెంట్‍, ఉచిత యోగా వర్క్ షాప్, బోన్‍మారో డ్రైవ్స్, సిపిఆర్‍ ట్రైనింగ్‍ కార్యక్రమాలు

* ఆంధప్రదేశ్‍లో తోలుబొమ్మలాట ప్రదర్శనలకు సహాయం

* అక్రాన్‍-కాంటన్‍ రీజియన్‍లో యునైటెడ్‍ వే, సమిట్‍ కౌంటీ సహకారంతో పేదపిల్లలకు 4000 బ్యాక్‍ప్యాక్స్ స్కూల్‍ బ్యాగ్‍ల పంపిణీ

* నార్తర్న్ ఒహాయో గోల్ఫ్ ఛారిటీస్‍ ఫౌండేషన్‍కు 10,000 డాలర్ల విరాళం

* ఆంధప్రదేశ్‍లో వివిధ ప్రభుత్వ స్కూళ్లలో 24 డిజిటల్‍ క్లాస్‍రూమ్‍ల ఏర్పాటుకు విరాళం

* తానా కాన్ఫరెన్స్ కమిటీల్లో భాగస్వామ్యంతో నిర్వహించిన వివిధ కార్యక్రమాలు- జాబ్‍ ఫెయిర్‍, ఇమ్మిగ్రేషన్‍ సర్వీసెస్‍, ట్రాన్స్ పోర్టేషన్ కమిటీ, గెస్ట్ రిలేషన్స్, మార్కెటింగ్‍, పబ్లిసిటీ వంటి కమిటీల్లో భాగస్వామ్యం

* తానా మ్యాగజైన్‍ కోసం 35,000 డాలర్ల సేకరణ

* బి ద ఛేంజ్‍, బ్యాక్‍ప్యాక్‍ పోగ్రామ్‍ కో ఆర్డినేటర్‍

వివిధ కార్యక్రమాలు, సేవల ద్వారా తానాకు గుర్తింపు

* ఒహాయోలో 2017 సంవత్సంలో గవర్నర్‍, లెఫ్టినెంట్‍ గవర్నర్‍ ద్వారా తానాకు ప్రత్యేక ప్రశంసా పురస్కారం
* ఒహాయో మేయర్‍ ద్వారా 2016 డిసెంబర్‍ 2ను తానా సర్వీస్‍ డేగా ప్రకటించేలా చేయించడం
* 2016లో సెనెటర్‍ షెర్రాడ్‍ బ్రౌన్‍ ద్వారా ప్రత్యేక ప్రశంసలు
* బి ద ఛేంజ్‍ పోగ్రామ్‍ ద్వారా చేసిన కమ్యూనిటీ సేవకు ప్రెసిడెన్షియల్‍ అవార్డ్
* తానా కార్యక్రమాలు, సర్వీసులపై భారతీయ స్టూడెంట్లకు అవగాహన కల్పించడం

ఇతర కమ్యూనిటీ కార్యక్రమాలు

* బి ద ఛేంజ్‍, బ్యాక్‍ప్యాక్‍ కార్యక్రమాల ద్వారా 5 సంవత్సరాలలోపు ఉన్న చిన్నారులకు గత 4 సంవత్సరాలుగా ప్రతి వారాంతంలో ఫుడ్‍ ఐటెమ్స్ పంపిణీ, దాదాపు 50,000కుపైగా భోజనం విరాళం.

* వివిధ స్టూడెంట్‍ కమిటీల్లో నాయకత్వం వహించడం వంటి ఎన్నో పదవులను చేపట్టి నేడు తానా ద్వారా వివిధ పదవుల ద్వారా కమ్యూనిటీకి సేవలందించాను.

* ప్రస్తుతం తానా ఎగ్జిక్యూటివ్‍ కమిటీ ట్రెజరర్‍ పదవికి పోటీ పడుతున్నాను. ఈ ఎన్నికల్లో మీరు ఆశీర్వదించి గెలిపించగలరని ప్రార్థిస్తున్నాను.

- అశోక్‍బాబు కొల్లా

https://www.facebook.com/ashokkolla

 

Tags :