ASBL Koncept Ambience

గేటెడ్ కమ్యూనిటీకి చిరునామా అశోకా సెంట్రల్ పార్క్

గేటెడ్ కమ్యూనిటీకి చిరునామా అశోకా సెంట్రల్ పార్క్

హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగంలో గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్టుల నిర్మాణంలో అశోకా సెంట్రల్‌ పార్క్‌ కూడా పేరు పొందింది. మోకిలా ప్రాంతానికే ఈ వెంచర్‌ ప్రధాన ఆకర్షణగా మారింది. హెచ్‌ఎండీఏ అనుమతి పొందిన ఈ 30 ఎకరాల ప్రీమియం గేటెడ్‌ కమ్యూనిటీకి కొనుగోలుదారుల నుంచి చక్కటి ఆదరణ లభిస్తున్నది. మెజిస్టిక్‌ ఎంట్రన్స్‌ గేట్‌తో పాటు సోలార్‌ ఫెన్సింగ్‌తో కూడిన ప్రహరీ గోడను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 200 ప్రత్యేక విల్లా ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. 267 గజాల నుంచి 1000 గజాల విస్తీర్ణంలో ప్లాట్లున్నాయి. ఇందులో 12,500 చదరపు గజాల్లో ఆధునిక క్లబ్‌ హౌజ్‌ను ముస్తాబు చేస్తున్నారు. ఒక్క సెంట్రల్‌ పార్కు కోసమే మూడు ఎకరాలను కేటాయించారు. 60, 40, 30 అడుగుల సిమెంట్‌ వైట్‌ టాప్‌ రోడ్లు, ఎవెన్యూ ప్లాంటేషన్‌, వీధి దీపాలు, జాగింగ్‌ ట్రాక్‌, అండర్‌ గ్రౌండ్‌ కేబులింగ్‌ వంటి వాటితో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ఈ వెంచర్‌ నుంచి కేవలం 10 నిమిషాల వ్యవధిలో గండిపేటకు చేరుకోవచ్చు. గచ్చిబౌలి నుంచి అశోకా సెంట్రల్‌ పార్కుకు రాకపోకలను సాగించడానికి మోకిలా-శంకరపల్లి 150 అడుగుల విశాలమైన రోడ్డు అందుబాటులో ఉన్నది.

ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ ఉండటంతో ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలకోసం చూడండి.

http://ashokacentralpark.com/

 

Tags :