ఘనంగా జరిగిన ఎఐఎ దీపావళి వేడుకలు
అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (ఎఐఎ), బాలీ 92.3 ఆధ్వర్యంలో దసరా, దీపావళి వేడుకలను వైభవంగా జరిపారు. దాదాపు 30 భారతీయ సంఘాలు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నాయి. విశాలమైన మైదానంలో జరిగిన ఈ వేడుకలకు దాదాపు 25,000 మందికిపైగా హాజరయ్యారు. భారతీయులకు పెద్ద పండుగ దసరా, దీపావళి. ఈ పండుగ వేడుకలను కూడా పెద్దఎత్తున, ఎంతో వైభవంగా, విభిన్నమైన కార్యక్రమాలతో ఉల్లాసంగా, ఉత్సాహంగా నిర్వహించారు.
ఈ వేడుకకు సంజీవ్ గుప్తా సిపిఎ (ఫైర్‌వర్స్స్ స్పాన్సర్), గ్రాండ్ స్పాన్సర్‌గా డా. ప్రకాష్ అద్వానీ ఫ్యామిలీ డెంటిస్ట్రీ (రావణ్ దహన్ స్పాన్సర్), ప్లాటినమ్ స్పాన్సర్స్ InsuKare.com insurance (రథయాత్ర స్పాన్సర్), సంపూర్ణవాస్తుకు చెందిన నీరాజీ మహామంగళహారతిని స్పాన్సర్ చేశారు. ఈవెంట్ పవర్‌డ్‌బై రెమిట్ 2 ఇండియా డాట్ కమ్‌తోపాటు ఇతర స్పాన్సర్లుగా న్యూయార్క్ లైఫ్ (సంగీత దత్తా), మంత్రి డెవలపర్స్, ఎఐజి ఇన్‌స్యూరెన్స్ (జాక్ దస్వాని), జి అండ్ సి గ్లోబల్ వ్యవహరించారు.
వేడుకల్లో భాగంగా రావణ్ దహన్, దివ్వెల తయారీ, రంగోలి, ఫ్లాష్‌మోబ్, డిజె జంక్షన్‌తోపాటు బాణాసంచాను పెద్దఎత్తున కాల్చారు. బాలీవుడ్ డ్యాన్స్‌లు, కరవోకె పాటలు అందరినీ హుషారెత్తించాయి. పలువురు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొని అందరికీ దసరా, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఫ్యాషన్ షో, ఎఐఎ, బాటా కు చెందిన కళాకారులు పలువురు పాడిన పాటలు అందరినీ ఉత్సాహపరిచాయి.
కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీ సభ్యుడు యాష్‌కల్రా, ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్ కోమటి, కుపర్టినో సిటీ మేయర్ డార్సి పాల్, శాంతాక్లారా కౌంటీ సూపర్‌వైజర్ డేవ్ కర్టెసీ, శాంతాక్లారా కౌంటీ షరీఫ్ లారీ స్మిత్, శాంతాక్లారా కౌంటీ అండర్‌షరీఫ్ రిక్ సుంగ్, ఫ్రీమాంట్ సిటీ కౌన్సిల్ మెంబర్ రాజ్ సల్వాన్, కుపర్టినో కౌన్సిల్ మెంబర్ సవితా వైద్యనాథన్, రో ఖన్నా ప్రతినిధి తదితర ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొని అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా లక్ష్మీదేవిని రథంపై కూర్చోబెట్టి ఊరేగించారు. పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజా స్వీట్స్‌వారు లడ్డు ప్రసాదాన్ని స్పాన్సర్ చేశారు. మహామంగళహారతి అందరినీ భక్తిపరవశులను చేసింది. చివరగా రాహన్ దహన్, ఫైర్‌వర్స్స్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. స్వాగత్ ఇండియన్ కుజిన్, ఛాట్ భవన్, పీకాక్ ఇండియన్ కుజిన్ - డబ్లిన్, కేక్స్ అండ్ బేక్స్, అరుసువై ఇండియన్ కుజిన్, దావత్, బాంబే 2 గోవా, మోమో ఫుడ్ ట్రక్, సావంత్ ఐస్‌క్రీమ్ తదితరులు ఫుడ్ కార్యక్రమానికి స్పాన్సర్లుగా వ్యవహరించారు. దాదాపు 25,000 మంది ఈ వేడుకల్లో పాల్గొని బే ఏరియాలో మరచిపోలేని కార్యక్రమంగా దీనిని నిర్వహించారని నిర్వాహకులను, ఇతరులను అభినందించారు.