తానా ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు ఆసు యంత్రాల పంపిణి
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వారి తెలంగాణ రాష్ట్రం లోని సంస్థాన్ నారాయణపురం మండలం పుట్టపాక గ్రామం లో పద్మశ్రీ చింతకుంట మల్లేశం గారు తయారు చేసిన ఆసు యంత్రములను చేనేత కార్మికులకు అందించటం జరిగినది. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు పోచంపల్లి పట్టు చీరలకి నూతన డిజైన్స్ లో ఈ యంత్రము ఎలా ఉపయోగపడుతుందో వివరించారు.
ఈ సందర్భంగా తానా అంతర్జాతీయ సమన్వయకర్త లక్ష్మి దేవినేని గారు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) వారు చేనేత కార్మికులకు ఆంధించే సహాయ సహకారాల గురించి మరియు మహిళా సాధికారతకు తానా చేయూత గురుంచి కార్మికులకు వివరించారు. తానా మరియు తెలంగాణ ప్రభుత్వం వారి సహకారంతో సుమారు 3 లక్షలు విలువచేసే 14 ఆసు యంత్రములను మహిళా చేనేత కార్మికులకు అందించారు.
పల్లె సృజన సంఘం అధ్యక్షులు బ్రిగ్రేడేయేర్ గణేశం గారు మాట్లాడుతూ తానా వారి సహాయసహకారాలని మరియు తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి గారు, తానా ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు గారు మరియు తానా కార్యవర్గం అందించే సహకారాన్ని కొనియాడారు.