ASBL Koncept Ambience

వర్జీనియాలో విజయవంతమైన ఆటా 17వ మహాసభల కాన్ఫరెన్స్ కర్టెన్ రైజర్

వర్జీనియాలో విజయవంతమైన  ఆటా 17వ మహాసభల కాన్ఫరెన్స్ కర్టెన్ రైజర్

జూలై ఒకటో తేదీ నుండి అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్‌ డి సి లో మూడు రోజులపాటు ఆటా 17వ మహాసభలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు దీనిలో భాగంగా వర్జీనియాలో హిల్టన్‌ హోటల్‌ లో మార్చి 12, 2022 శనివారంనాడు కర్టెన్‌ రైజర్‌ పేరుతో అత్యంత విజయవంతంగా బోర్డ్‌ మీటింగ్‌ మరియు కాన్ఫరెన్స్‌ కర్టెన్‌ రైజర్‌ని నిర్వహించింది. ఉదయం సెషన్‌లో, ఆటా అధ్యక్షుడు (భువనేష్‌ బూజాల), కార్యదర్శి (హరి లింగాల), మరియు కోశాధికారి (సాయినాథ్‌ బోయపల్లి) సంస్థ నిర్వహిస్తున్న కార్యకలాపాలపై నివేదికలు సమర్పించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేక నగరాల్లో, సాంకేతికత, పన్నులు, ఆరోగ్య సమస్యలపై శిక్షణా తరగతులు బీ వీక్లీ యోగా మరియు మెడిటేషన్‌ వర్చువల్‌ మరియు ఫిజికల్‌ కార్యక్రమాలు నిర్వహించారు. ట్రెజరీ కార్యదర్శి ఆటా అద్భుతమైన ఆర్థిక స్థితిలో ఉందని చూపించారు.ప్రతిష్టాత్మక ఆటా సంస్థ స్వచ్ఛంద కార్యక్రమాలపై అభిప్రాయాన్ని అందించారు:  My School--My Responsibility  భారతదేశంలో పాఠశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం నా బాధ్యత. అమెరికా లో విద్యార్థి యూత్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌లు మరియు భారతదేశంలో ఆటా కుటుంబ సభ్యుల కోసం ఆరోగ్య తనిఖీ కార్యక్రమాలు నిర్వహించారు. డిసెంబర్‌ 2021లో నిర్వహించిన ఆటా వేడుకలు ఘనంగా ప్రదర్శించబడ్డాయి. కార్యక్రమాలు విజయవంతం చేసిన పీఠాధిపతులకు, సహచరులకు, వేడుకలు టీమ్‌ని అందరూ అభినందించారు.

మధ్యాహ్నం సెషన్ లో 17వ ఆటా కాన్ఫరెన్స్‌ మరియు యూత్‌ కన్వెన్షన్‌ పై దృష్టి సారించింది, వివిధ కమిటీల నుండి ప్రదర్శనలు: సాంస్కృతిక, వ్యాపారం, ఆతిథ్యం, భద్రత, రవాణా, మహిళలు, యువత, సాహిత్యం, కాన్ఫరెన్స్‌ వెబ్‌సైట్‌, జూలై 1,2 మరియు 3 తేదీలలో అత్యంత విజయవంతంగా నిర్వహించడానికి నిధుల సేకరణ కార్యకలాపాలను బోర్డు సమీక్షించింది. ఇప్పటివరకు వాషింగ్టన్‌ డి సి, అట్లాంటా, డెట్రాయిట్‌ మరియు ర్యాలీ నగరాలలో నిర్వహించిన కార్యకలాపాలు అంచనాలను మించిపోయాయి. మార్చి మరియు ఏప్రిల్‌లో ఇతర నగరాలలో నిధుల సేకరణలకు ప్లానింగ్‌ చేశారు.

సాయంత్రం జరిగిన సెషన్లో భువనేశ్‌ భుజాల అధ్యక్షతన, సుధీర్‌ బండారు కన్వీనర్‌ మరియు కిరణ్‌ పాశం కోఆర్దినటర్‌ గా ఆటా 17వ మహాసభల కాన్ఫరెన్స్‌ కర్టెన్‌ రైజర్‌ కార్యక్రమం ప్రారంభించటం జరిగింది. అనంతరం పెద్దఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇతర నగరాల నుండి 1,000 మందికి పైగా హాజరయ్యారు. ఆటా 17వ మహాసభలకు కో హోస్ట్‌గా వ్యహారిస్తున్న క్యాట్స్‌ తెలుగు సంఘం అధ్యక్షుడు సతీష్‌ వడ్డి  ఇతర కార్యవర్గం పెద్దసంఖ్యలో ఈ ఉత్సవాలకు హాజరయి తమ సంఘం తరఫున ఆటా ఉత్సవాలను దిగ్విజయం చేయటానికి సహకారం అందిస్తామని ప్రకటించారు. మరో ప్రముఖ తెలుగు సంఘం ఆఫ్టా వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్‌ చందు, రవి ముళ్ళపూడి, శౌరి ప్రసాద్‌ మరియు ఇతర కార్యవర్గం పెద్దసంఖ్యలో ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. తమ సంఘం తరఫున ఆటా ఉత్సవాలను దిగ్విజయం చేయటానికి సహకారం అందిస్తామని ప్రకటించారు. ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్‌ చందు మాట్లాడుతూ ఆటా ఉత్సవాలకు తమ సంఘం నుండి లక్ష డాలర్లు విరాళంగా అందిస్తామని ప్రకటించారు. తమ సంఘం నుండి వెయ్యి మంది ఉత్సవాలకు హాజరవుతారని తెలిపారు, అలాగే మరో ప్రముఖ తెలుగు సంఘం వారధి నూతన అధ్యక్షుడు నరసింహా దోమ మాట్లాడుతూ ఆటా ఉత్సవాలకు తమ సంఘం నుండి ఇరువయి వేల డాలర్లు విరాళంగా అందిస్తామని ప్రకటించారు.

అధ్యక్షుడు భువనేశ్‌ భుజాల మాట్లాడుతూ, ఆటా 17వ మహాసభలను 10,000 పైగా హాజరయ్యె విధంగా మరియు నభూతో న భవిష్యతి గా నిర్వహిస్తామని చెప్పారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పద్మవిభూషణ్‌ జగ్గీ వాసుదేవ్‌ (సద్గురు) ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారని, ప్రముఖ కవులు, కళాకారులు, రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, సినీ నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తో గోల్ఫ్‌ టోర్నమెంట్‌, సంచలనం సృష్టిస్తున్న గాయకుడు రాం మిరియాల, ముగింపు రోజున ప్రముఖ సంగీత దర్శకుడు పద్మవిభూషణ్‌ ఇళయరాజా సంగీత విభావరి ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే ఈ 17వ మహాసభలకు తెలుగు వారి నుంచి, అన్ని తెలుగు సంఘాల నుండి పూర్తి సహకారం ఉంటుదని వారికి ధన్యవాదాలు తెలియజేశారు. చివరగా ఆటా జాతీయ మీడియా చైర్‌ భాను స్వర్గం మరియు ఆటా 17వ మహాసభల కాన్ఫరెన్స్‌ మీడియా చైర్‌ రాము ముండ్రాతి మాట్లాడుతూ అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్‌ డి సి లో మూడు రోజులపాటు ఆటా 17వ మహాసభలు పెద్ద ఎత్తున  దిగ్విజయం చేయటానికి అమెరికాలో వున్న తెలుగు వారందరికీ వివిధ మాద్యమాల ద్వారా సమాచారం అందిస్తున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమాన్ని కాన్ఫరెన్స్‌ కమిటీ నిర్వహకులు దీపిక భుజాల, అపర్ణ కడారి, రవి చల్లా, శ్రవణ్‌ పాడూరు, రవి బొజ్జ,  కౌశిక్‌ సామ, సతీష్‌ వడ్డి, అమర్‌ పాశ్య, లోహిత్‌ రెడ్ది, ప్రవీణ్‌ దాసరి, హనిమి వేమిరెడ్డి, నవీన్‌ రంగ,రాణా చెగు, శ్రీకాంత్‌ దుబ్బుడు, అనిల్‌ కేశినేని, విజయ దొండేటి, హర్ష రెడ్డి, పవన్‌ పెండ్యాల మరియు రాము ముండ్రాతి ఘనంగా నిర్వహించారు.

 

Click here for Photogallery

 

Tags :