ఆటా మహా సభలు ముందుగా దేశ వ్యాప్తంగా జరిగే వివిధ పోటీలు- కార్యక్రమాలు
వివిధ ఆటల పోటీలు
అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో జూలై ఒకటో తేదీ నుండి అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డిసిలో మూడు రోజులపాటు నిర్వహించనున్న ఆటా 17వ మహాసభలను పురస్కరించుకుని వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ మహాసభలకు దాదాపు 10,000మందికి పైగా హాజరవుతారని భావిస్తున్నారు. మహాసభల్లో తెలుగు కమ్యూనిటీని మరింతగా పాల్గొనేలా చేసేందుకు వీలుగా వివిధ రకాల ఆటల పోటీలను ఆటా ఏర్పాటు చేసింది. ఆటా అధ్యక్షులు భువనేష్ బుజాల, కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు ప్రత్యేకంగా వాషింగ్టన్ డి సి, మేరిల్యాండ్, వర్జినీయా రాష్ట్రాలలో ఉంటున్న తెలుగువారందరిని ప్రోత్సహించటంకోసం వివిధ రకాల ఆటల పోటీలను ఆటా తరపున నిర్వహిస్తున్నారు. పురుషులకు, మహిళలకు ప్రత్యేకంగా నిర్వహించే ఈ ఆటలపోటీల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.
చెస్, టెన్నిస్, వాలీబాల్, త్రోబాల్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్, బ్యాడ్మింటన్, క్రికెట్, గోల్ఫ్, 5కె రన్, ఉమెన్స్ రమ్మీ తదితర పోటీలను నిర్వహిస్తున్నారు. అధ్యక్షుడు భువనేష్ బుజాల, కన్వీనర్ సుధీర్ బండారు. కో ఆర్డినేటర్ కిరణ్‌పాశం, లోకల్ కో ఆర్డినేటర్ శ్రావణ్ పాడూరు, స్పోర్ట్స్ చైర్ సుధీర్ దమిడి, స్పోర్ట్స్ కో చైర్ శ్రీధర్ బండి ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేలా చూస్తున్నారు.
13 నగరాల్లో ఆటా అందాల పోటీలు
ఆటా ఆధ్వర్యంలో జూలై ఒకటో తేదీ నుండి అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డిసిలో మూడు రోజులపాటు నిర్వహించనున్న ఆటా 17వ మహాసభలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఆటా అందాల పోటీలను నిర్వహిస్తున్నారు.
ఆటా బ్యూటీ పేజియంట్ 2022 పోటీలను 13 నగరాలలో 8 వారాలపాటు టీన్, మిస్, మిస్సెస్ ఆటా బ్యూటీ పేరుతో నిర్వహిస్తున్నారు. 17వ ఆటా కన్వెన్షన్ వేదికగా జూలై 1 నుంచి 3వ తేదీ వరకు వాల్టర్ ఇ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రముఖ జడ్జిల సమక్షంలో స్టార్ సెలెబ్రెటీస్ చేతుల మీదుగా విజేతకు టైటిల్‌ను అందాల కిరీటాన్ని బహుకరించనున్నారు. వర్జీనియా, న్యూజెర్సీ, డెలావేర్, ఛార్లెట్, ర్యాలీ, అట్లాంటా, నాష్విల్, డెట్రాయిట్, చికాగో, డల్లాస్, పోర్ట్ లాండ్, సియాటిల్, లాస్ ఏంజలెస్ నగరాల్లో నిర్వహిస్తున్నారు. మీ ఆడిషన్ ఎంట్రీ www.ataconference.org/events-registrations లో రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.
ఆటా ‘సయ్యంది పాదం’ డాన్స్ పోటీలు
ఆటా ఆధ్వర్యంలో జూలై ఒకటో తేదీ నుండి అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డిసిలో మూడు రోజులపాటు నిర్వహించనున్న ఆటా 17వ మహాసభలను పురస్కరించు కుని ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా మీ ఆటకి మా ‘ఆటా’ వేదిక అంటూ సయ్యంది పాదం పేరుతో డాన్స్ పోటీలు నిర్వహిస్తున్నారు. క్లాసికల్ మరియు నాన్ క్లాసికల్ విభాగాల్లో సోలో, గ్రూప్ డాన్స్ పోటీలు ఉన్నాయి. జులై 1 నుంచి 3 వరకు ఆటా మెగా కన్వెన్షన్ వేదికగా ఫైనల్స్ రౌండ్ నిర్వహిస్తారు. 7 ఏళ్ల నుంచి 14 ఏళ్ల వయస్సు పైబడిన వారు ఎవరైనా ఈ పోటీల్లో పాల్గొనే సదవకాశం ఉంది. వర్జీనియా, డల్లాస్, న్యూజెర్సీ, ర్యాలీ, అట్లాంటా, నాష్విల్, సియాటిల్, లాస్ ఏంజలెస్, పోర్ట్ లాండ్, డిట్రాయిట్, చికాగో నగరాల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు. ఫైనల్స్ రౌండ్‌కి టాలీవుడ్ డాన్స్ మాస్టర్ శేఖర్ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తారు. విజేతలకు స్టార్ సెలెబ్రెటీస్ చేతుల మీదుగా అవార్డులు ఇవ్వనున్నారు. ఇతర వివరాల కోసం ఆటా కాన్ఫరెన్స్ వెబ్‌సైట్‌ను చూడండి. www.ataconference.org
ఆటా ‘ఝమ్మంది నాదం’ పాటల పోటీలు
అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో జూలై ఒకటో తేదీ నుండి అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డిసిలో మూడు రోజులపాటు నిర్వహించనున్న ఆటా 17వ మహాసభలను పురస్కరించుకుని వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ‘రaుమ్మంది నాదం’ అంటూ పాటల పోటీలు నిర్వహిస్తున్నారు. ఆటా వారి ఈ కార్యక్రమం వర్థమాన గాయకులకు మంచి వేదికగా నిలవనున్నది. అన్ని వయస్సులు వారికీ పోటీల్లో పాల్గొనే అద్భుత అవకాశాన్ని నిర్వాహకులు కల్పించారు. ఈ పాటల పోటీల ఫైనల్ జూలై 1 నుంచి 3వ తేదీ వరకు జరిగే ఆటా మెగా కన్వెన్షన్ వేదికగా జరుగుతాయి. ఇంకెందుకు ఆలస్యం మీ నాదంతో సప్తస్వరాలు పలికించండి, ఆటా ఝమ్మంది నాదం 2022 విజేతలుగా నిలవండి. స్టార్ సెలెబ్రెటీస్ చేతుల మీదుగా అవార్డు ప్రదానోత్సవం అందుకునేందుకు ఈ రోజే మీ ఎంట్రీని రిజిష్టర్ చేసుకోంది.
మీ ఆడిషన్ ఎంట్రీ రిజిస్టర్ చేసుకోవడానికి www.ataconference.org/events-registrations ని సందర్శించండి.