ASBL Koncept Ambience

కాన్ఫరెన్స్ సక్సెస్ కు కృషి చేస్తున్న కమిటీలు

కాన్ఫరెన్స్ సక్సెస్ కు కృషి చేస్తున్న కమిటీలు

అమెరికా తెలుగు సంఘం (ఆటా) ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే మహాసభలకు ఈసారి చికాగో వేదికైంది. ఆటాకు ఇది 25వ వార్షికోత్సవం. దాంతో ఈ వేడుకను అంగరంగ వైభవంగా జరపాలని ఆటా నాయకులు ముందుగానే నిర్ణయించుకున్నారు.

ఈ కాన్ఫరెన్స్‌కోసం వివిధ కమిటీలను ఆటా ప్రెసిడెంట్‌ సుధాకర్‌ పెర్కారీ, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ కరుణాకర్‌ అసిరెడ్డి బోర్డు సభ్యులు ఏర్పాటు చేశారు. కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌గా చంద్రశేఖర్‌ రెడ్డి పాల్వాయి, కాన్ఫరెన్స్‌ డైరెక్టర్‌గా కృష్ణ కె రెడ్డి, కోఆర్డినేటర్‌గా కమల చిమట వ్యవహరిస్తున్నారు.

అడ్‌హాక్‌ కమిటీకి సుధాకర్‌ పెర్కారీ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. కరుణాకర్‌ అసిరెడ్డి కో చైర్‌గా ఉన్నారు. చంద్రశేఖర్‌ రెడ్డి పాల్వాయి, మధు బొమ్మినేని, అనిల్‌ బొద్దిరెడ్డి అనంత్‌ రెడ్డి పజ్జూర్‌, వినోద్‌ కోడూరు, శరత్‌ వేముల, విజయ్‌ కుందూర్‌, రవీందర్‌ రెడ్డి, అరవింద్‌ రెడ్డి ముప్పిడి, కమల చిమట, సురేష్‌ జిల్లా ఉన్నారు. అలూమ్ని కమిటీకి చైర్‌ పర్సన్‌గా మోహన్‌ మన్నె వ్యవహరిస్తున్నారు. ఆర్టిస్ట్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ చైర్‌ పర్సన్‌గా చాందిని దువ్వూరి, ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ చైర్‌పర్సన్‌గా శ్రీకాంత్‌ రెడ్డి, ఆడియో విజువల్‌ చైర్‌పర్సన్‌గా శర్మ కొంకపాక, అవార్డ్స్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా మెహర్‌ మాధవరం వ్యవహరిస్తున్నారు.

బాంక్వెట్‌ కమిటీ సుధీర్‌ వెల్పుల చైర్‌పర్సన్‌గా, బడ్జెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా కిరణ్‌ రెడ్డి, బిజినెస్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా జయంత్‌ రెడ్డి చల్లా, చిల్డ్రన్స్‌ ప్రోగ్రామ్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా సుమన్‌ సోమశేఖర్‌, కమ్యూనిటీ సర్వీసెస్‌ చైర్‌పర్సన్‌గా డా. ప్రకాశం టాటా, ఎడ్యుకేషన్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా  రాఘవ్‌ జట్ల వ్యవహరిస్తున్నారు. ఫిలిం కమిటీ చైర్‌పర్సన్‌గా సాయి రవి, ఫైనాన్స్‌ కమిటీ చైర్‌ పర్సన్‌గా రత్నాకర్‌ కారుమూరి, ఫుడ్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా సుజాత అప్పలనేని, ఫండ్‌రైజింగ్‌ కమిటీ చైర్‌ పర్సన్‌గా కెకె రెడ్డి, గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌గా శ్రీనివాసరావు, సతీష్‌ చిల్లా, గోవింద్‌ ఉండ్రు, రామ్‌ దేవరకొండ వ్యవహరిస్తున్నారు. హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ చైర్‌ పర్సన్‌గా డా. విజయ సుసర్ల వ్యవహరిస్తున్నారు. హాస్పిటాలిటీ డోనర్స్‌ చైర్‌పర్సన్‌గా కరుణాకర్‌ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇనాగురల్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా హరి ప్రసాద్‌ లింగాల వ్యవహరిస్తున్నారు. లిటరరీ కమిటీ చైర్‌పర్సన్‌గా జయదేవ్‌ మెట్టుపల్లి వ్యవహరిస్తున్నారు. లోకల్‌ కోర్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా రమేష్‌ తుమ్మూరు, మెట్రిమోనియల్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా శారద మెట్టుపల్లి, మీడియా కమిటీ చైర్‌పర్సన్‌గా కీర్తి రావూరి, ఓవర్సీస్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా అమరేంద్ర నెట్టెం, ప్యానెల్‌ డిస్కషన్స్‌ అండ్‌ సెమినార్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా లోకేష్‌ కొసరాజు వ్యవహరిస్తున్నారు.

పొలిటికల్‌ ఫోరం కమిటీ చైర్‌పర్సన్‌గా చేతనా రెడ్డి బండారు, ప్రోగ్రామ్స్‌ అండ్‌ ఈవెంట్స్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా సతీష్‌ కొడుకుల వ్యవహరిస్తున్నారు. పబ్లిసిటీ కమిటీ చైర్‌పర్సన్‌గా వెంకటేశ్వర్‌ రెడ్డి రామిరెడ్డి, రిసెప్షన్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా ఇఫ్తెకర్‌ షరీఫ్‌, రిజిస్ట్రేషన్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా శ్రీనివాస్‌ రెడ్డి వోరుగంటి, సీనియర్‌ సిటిజెన్స్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా అనంత్‌ వూట్కూర్‌, సిల్వర్‌ జూబ్లి కమిటీ చైర్‌పర్సన్‌గా డా. రాజేశ్వరరావు టేక్మల్‌, స్ప్రిట్చువల్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా శివ పాలకోడేటి, ట్రాన్స్‌పోర్టేషన్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా మహీధర్‌ ముస్కుల, ఉమెన్స్‌ ఫోరం కమిటీ చైర్‌పర్సన్‌గా డా. ఉమ కటికి, యూత్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా తన్విశ్రీ జట్ల వ్యవహరిస్తున్నారు.

 

Tags :