ASBL Koncept Ambience

వర్జీనియాలో ‘ఆటా’ బ్యాడ్మింటన్ పోటీలు విజయవంతం

వర్జీనియాలో ‘ఆటా’ బ్యాడ్మింటన్ పోటీలు విజయవంతం

వాషింగ్టన్‌ డీసీలో జూలై 1 నుండి జూలై 3 వరకు జరగనున్న 17వ ఆటా కన్వెన్షన్‌ మరియు యూత్‌ కాన్ఫరెన్స్‌ సందర్భంగా, ఆటా కన్వెన్షన్‌ టీమ్‌ మే 21వ తేదీన వర్జీనియాలోని ‘‘నార్తర్న్‌ వర్జీనియా బ్యాడ్మింటన్‌ క్లబ్‌’’లో బ్యాడ్మింటన్‌ పోటీలను విజయవంతంగా నిర్వహించింది. ఎంతో ఉత్సాహంగా నిర్వహించిన ఈ పోటీల్లో 150 మందికి పైగా పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో ఆటా కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ సుధీర్‌ బండారు, స్పోర్ట్స్‌ స్పాన్సర్‌ సన్‌రే సిస్టమ్‌ రవి పాల్గొని విజేతలకు ట్రోఫీలు, ప్రైజ్‌ మనీ అందజేశారు.

విజేతల వివరాలు

అండర్‌ 12 బాలికల సింగిల్స్‌ -విజేత వినయ చెరుకు, రన్నరప్‌ మను బచ్చల.
అండర్‌ 12 బాలికల డబుల్స్‌ - విన్నర్‌ వినయ మరియు శ్రీయా, రన్నరప్‌ సాన్వి మరియు రిధిమ.
అండర్‌ 12 బాలుర సింగిల్స్‌- విన్నర్‌ అహన్‌, రన్నరప్‌ అనిరుధ్‌.
అండర్‌ 16 బాలికల సింగిల్స్‌- విన్నర్‌ రవ్య, రన్నర్‌ అప్‌ అన్విత
మహిళల డబుల్స్‌ డివిజన్‌ 1- విన్నర్‌ ఇందు మరియు లావణ్య, రన్నరప్‌లు అన్విత మరియు రవ్య.
మహిళల డబుల్స్‌ డివిజన్‌ 2 - విన్నర్‌ లక్ష్మి మరియు హేమ, రన్నరప్‌లు వినయ మరియు వేదిక.
పురుషుల డబుల్స్‌- విజేత సిజన్‌ మరియు గోపీన్స్‌, రన్నర్‌ సిజన్‌ మరియు గోపినాథ్‌.
మహిళల సింగిల్స్‌- విజేత చాందిని సురేష్‌, రన్నర్‌ అప్‌ లావణ్య.
పురుషుల సింగిల్స్‌- విజేత సృజన్‌, రన్నర్‌ అప్‌ గోపీనాథ్‌.

కన్వెన్షన్‌ కోఆర్డినేటర్‌ రవి చల్లా, స్థానిక కోఆర్డినేటర్‌ శ్రవణ్‌ పాడూరు, క్యాట్స్‌ (క్యాపిటల్‌ ఏరియా తెలుగు అసోసియేషన్‌) అధ్యక్షుడు సతీష్‌ వడ్డే హాజరై విజేతలను అభినందించారు. అనేక విభాగాల్లో పోటీలను విజయవంతంగా నిర్వహించిన బ్యాడ్మింటన్‌ ఇన్‌ఛార్జ్‌లు దినకర్‌, జగదీశ్‌ భాను, బాబీ, శీతల్‌లకు స్పోర్ట్స్‌ చైర్‌ సుధీర్‌ దమ్మిడి, కో-చైర్‌ శ్రీధర్‌ బండి అభినందనలు తెలిపారు. రాబోయే ఆటా క్రీడా పోటీలలో అందరూ ఇదే ఉత్సాహంతో పాల్గొనాలని అభ్యర్థించారు.

ఆటా కన్వెన్షన్‌ మరియు యూత్‌ కాన్ఫరెన్స్‌ వాషింగ్టన్‌ డీసిలో జూలై 1-3 తేదీల్లో జరగనుంది. సద్గురు, విజయ్‌ దేవరకొండ, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఇళయరాజా, ఎస్‌ఎస్‌ తమన్‌, రామ్‌ మిర్యాల, మంగ్లీ, కపిల్‌ దేవ్‌, గవాస్కర్‌ వంటి పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఆటా 17వ మహాసభలు వివరాలకు https://www.ataconference.org చూడగలరు.

 

Click here for Event Gallery

 

 

Tags :