ఆటా బిజినెస్ కాన్ఫరెన్స్
అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో జరగనున్న ఆటా కాన్ఫరెన్స్‌లో బిజినెస్ కాన్ఫరెన్స్‌ను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. వ్యాపార, వాణిజ్య రంగంలో నిష్ణాతులైన వారి ప్రసంగాలతోపాటు వారి ద్వారా స్ఫూర్తిని పొందేలా కార్యక్రమాలను కూడా తయారు చేశారు. జూలై 2వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి జూలై 3వ తేదీ 5 గంటల వరకు ఈ బిజినెస్ కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు.
జూలై 2, మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమోటింగ్ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌పై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిఎంఆర్ గ్రూపు చైర్ పర్సన్ గ్రంధి మల్లిఖార్జునరావు, ఆటమిక్ గ్లోబల్ కార్పొరేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జనరల్ డాక్టర్ వివేక్ లాల్, జార్జి టౌన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గెర్రి జార్జ్, పద్మభూషణ్ సునీల్ గవాస్కర్, కార్డియాలజిస్ట్, ఎంట్రప్రెన్యూర్, ఫిలాంత్రపిస్ట్ డాక్టర్ కిరణ్ సి. పటేల్ పాల్గొంటున్నారు.
జూలై 2, మధ్యాహ్నం 3.30కు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యునైటెడ్ ససస్టైనబుల్ ఎనర్జీ ఫర్ ఆల్ మాజీ సిఓఓ మొహీందర్ గులటి, గుప్తా ఫ్యామిలీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. శశి గుప్తా, గో కూప్ డాట్ కమ్ ఫౌండర్ శివ దేవిరెడ్డి, జిఎంఆర్ ఏర్‌పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్‌జికె కిషోర్ పాల్గొంటున్నారు.
జూలై 3, ఉదయం 8.30 గంటలకు ఉమెన్ ఇన్ బిజినెస్ లీడర్ షిప్ కార్యక్రమంలో పలువురు మహిళా బిజినెస్ వేత్తలు పాల్గొంటు న్నారు. ఎమాజియా సిఇఓ, ఫౌండర్ వీనా గుండవల్లి, బి పాజిటీవ్ మ్యాగజైన్ ఎడిటర్ ఇన్ చీఫ్, అపోల్ లైఫ్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కొణిదెల, ప్యూచర్ యాకర్స్ సిఇఓ సుమా రెడ్డి పాల్గొంటున్నారు.
జూలై 3, ఉదయం 10.30 గంటలకు ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే అంశంపై కార్యక్రమం జరుగుతుంది. ఫ్రెడ్డి మాక్ ఇంజనీరింగ్ అనాలిటీక్స్, ఇన్నోవేషన్ ఇన్ డాటా సైన్స్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీ పురుషోత్తమన్, గ్లోబల్ టెక్నాలజీ సర్వీసెస్ స్టేట్ స్ట్రీట్ కార్పొరేషన్ మేనెజింగ్ డైరెక్టర్ ప్రవీణ భీమవరపు, వెల్స్ ఫర్గో హోమ్ లెండిరగ్ డివిజన్ సిఐఓ సత్య అడ్డగార్ల పాల్గొంటున్నారు.
జూలై 3, మధ్యాహ్నం 1.30 గంటలకు ఎగ్జిట్ స్ట్రాటజీ, ఎం అండ్ ఎ, వెల్త్ మేనెజ్‌మెంట్ అన్న అంశంపై జరిగే కార్యక్రమంలో మెరిల్ లించ్, వెల్త్ మేనెజ్‌మెంట్ అడ్వయిజర్ రాజు అల్లూరి, 3లైన్స్ అర్బిట్ ఫండ్ జనరల్ పార్టనర్, సిఇఓ కృష్ణ కూనపులి, టి`హబ్ వైస్ ప్రెసిడెంట్ పన్నీర్ సెల్వం మదనగోపాల్, డల్లాస్ వెంచర్ క్యాపిటల్ మేనెజింగ్ డైరెక్టర్, ఫౌండర్ దయాకర్ పుస్కూర్, పవర్ హౌజ్ వెంచర్స్ మేనెజింగ్ డైరెక్టర్, ఫౌండర్ శ్రీ పెద్దు, సస్సీడ్ ఇండోవేషన్ ఫండ్ మేనెజింగ్ పార్టనర్, కో ఫౌండర్, విక్రాంత్ వర్ష్నీ పాల్గొంటున్నారు. ఈ బిజినెస్ కాన్ఫరెన్స్‌కు రాణా చేగు చైర్‌గా, లక్స్ చేపూరి కో చైర్‌గా వ్యవహరిస్తున్నారు.