ASBL Koncept Ambience

ఆటా బిజినెస్ కాన్ఫరెన్స్

ఆటా బిజినెస్ కాన్ఫరెన్స్

హైదరాబాద్‌లో ఆటా వేడుకల్లో భాగంగా టీహబ్‌లో నిర్వహించే బిజినెస్‌ కాన్ఫరెన్స్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌ ప్రధాన వక్తగా పాల్గొంటున్నారు. ఇందులో పలు అంశాలను చర్చించనున్నారు. యుఎస్‌ ఇండియా పార్టనర్‌ షిప్స్‌ - ఛాలెంజెస్‌ అండ్‌ అపర్చునిటీస్‌ అంశంపై జరిగే చర్చలో పలువురు పాల్గొంటున్నారు. జయేష్‌ రంజన్‌ (ప్రిన్సిపల్‌ సెక్రటరీ, తెలంగాణ), మోహన్‌ రెడ్డి (చైర్మన్‌, సైలెంట్‌ ఇంక్‌), శ్రీకాంత్‌ బడిగ (చైర్మన్‌, ఇండియన్‌ అమెరికన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌), వినయ్‌ తుమ్మలపల్లి (మాజీ రాయబారి), జే చల్లా (ప్రెసిడెంట్‌, ఏస్‌ ఇన్ఫో సొల్యూషన్స్‌), శ్రీకాంత్‌ సింహ (సిఇఓ, తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌), జే కృష్ణన్‌ (మాజీ సీఇఓ-టీ హబ్‌, ఎంట్రప్రెన్యూరర్‌), వెంకట్‌రెడ్డి (డైరెక్టర్‌-జినిసిస్‌ బయాలజిక్స్‌) యుఎస్‌ అండ్‌ కెనడా గ్రీన్‌ కార్డ్‌- రెసిడెన్స్‌ అంశంపై కెనడా మంత్రి సంతోష్‌ సోమిరెడ్డి, చుగ్‌లా ఫర్మ్‌, కిరణ్‌ పాశం తదితరులు ప్రసంగిస్తారు.

స్పీడ్‌ డేటింగ్‌ విత్‌ స్టార్టప్స్‌ అండ్‌ వీసీస్‌ అంశంపై గణేష్‌ రాయల, వెంచర్‌ కాపిటలిస్ట్స్‌, బిజినెస్‌ ఓనర్స్‌, స్టార్టప్‌ కంపెనీకి చెందిన ప్రముఖులు పాల్గొని ప్రసంగించనున్నారు.

ఈ బిజినెస్‌ సెమినార్‌లో అమెరికాకు చెందిన పలువురు సిఇఓలు కూడా పాల్గొంటున్నారు. రానా చేగు, భువనేష్‌ బూజాల, జయంత్‌ చల్లా, రామ్‌ మట్టపల్లి, సుధాకర్‌ గార్లంక, కిరణ్‌ పాశం, వేణు పిసిక, కరుణాకర్‌ అసిరెడ్డి, వినోద్‌ కోడూరు, సన్నిరెడ్డి, రిందాసామ, లక్స్‌ చేపూరి, శ్యాంపాల్‌, ప్రదీప్‌ పాల్‌ రెడ్డి, కార్తిక్‌ పొల్సాని, పార్థకారంఞ సెట్టి, కాశీ కోత తదితరులు పాల్గొంటున్నారు.

వైజాగ్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో డిసెంబర్‌ 18వ తేదీన జరిగే కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మేకపాటి గౌతంరెడ్డి హాజరవుతున్నారు. సన్నిరెడ్డి ఈ సెమినార్‌కు చైర్‌గా వ్యవహరిస్తున్నారు.

 

Tags :