చిరకాలం గుర్తుండిపోయే కాన్ఫరెన్స్ ఇది - ఆటా కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ బండారు
అమెరికా తెలుగు సంఘం (ఆటా) వాషింగ్టన్‌డీసిలో జూలై 1 నుంచి 3వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్న 17వ ఆటా మహసభలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వాల్టర్ ఇ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఇప్పటికే అనేకమంది ప్రముఖులు వస్తున్నట్లు తెలియజేశారు. సినిమా నటీ నటులు, రాజకీయ నాయకులు, సాంస్కృతిక కళాకారులు, సాహితీవేత్తలు, మహిళా ప్రముఖులు, బిజినెస్ రంగానికి చెందిన ప్రముఖులు, క్రీడాకారులు ఇలా ఎందరో ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. అలాగే ఈ మహాసభలకోసం ఆటా నాయకత్వం దాదాపు 75 కమిటీలతో, 350 మందికిపైగా కమిటీ సభ్యులతో వివిధ కమిటీలను ఏర్పాటు చేసి, ప్రణాళికబద్దంగా ఏర్పాట్లను చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగు టైమ్స్ కన్వెన్షన్ కన్వీనర్ సుధీర్ బండారు ను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పిన విషయాలను ఇక్కడ ఇస్తున్నాము. అలాగే ఈ కాన్ఫరెన్స్ చిరకాలం గుర్తుండిపోయే కాన్ఫరెన్స్ లా ఉంటుందని ఆయన నమ్మకంగా పేర్కొంటూ, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా ఉన్నాయని తెలిపారు.
తొలిరోజు జూలై 1వ తేదీన నిర్వహించే కార్యక్రమాల విశేషాలు
శుక్రవారం, జూలై1న బాంక్వెట్ నైట్‌తో ఆటా మహాసభల కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. అమెరికాలో భారత రాయబారిగా ఉన్న తరుణ్‌జిత్ సింగ్ సంధు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా, వాషింగ్టన్ డీసి మేయర్ మురళీ బౌసర్ గౌరవ అతిధిగా హాజరవుతున్నారు. వీరితోపాటు అనేక మంది ప్రముఖులు కూడా బాంక్వెట్ డిన్నర్‌కు వస్తున్నారు. మొదటిసారిగా ఇండియన్ ఎంబసీ తరపున 75 సంవత్సరాల ఇండియా ఇండిపెండెన్స్ మహోత్సవాల్లో భాగంగా ఇండియా నుంచి వచ్చిన సాంస్కృతిక బృందంతో ఓ నృత్య ప్రదర్శనను కూడా ఈ బాంక్వెట్‌లో ఏర్పాటు చేశాము. గాయని సునీత వ్యాఖ్యాతగా, గాయకులు రామ్ మిర్యాల, మంగ్లీల గానాలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. 14 రంగాల్లో విశేష ప్రతిభ చాటిన వారికి ఆటా అవార్డులను కూడా ఈ కార్యక్రమంలోనే బహుకరించనున్నాము.
జూలై 2వ తేదీ కార్యక్రమాల ప్రత్యేకం..
జూలై 2, శనివారం ఉదయం ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. 45 నిముషాలు సాగే ప్రారంభ కార్యక్రమంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రానికి చెందిన కళా బృందాలతో ఊరేగింపు. చంద్రబోస్ రాసిన రామాచారి స్వరకల్పన చేసిన ప్రారంభ నృత్య ప్రదర్శన ఈ కాన్ఫరెన్స్‌లో పత్యేకంగా హైలైట్‌గా కనిపిస్తుంది. ఇందులో దాదాపు 250 మంది పిల్లలు పాల్గొంటున్నారు.
ఆరోజు సాయంత్రం 6.30 ప్రైమ్ టైమ్‌లో జరిగే కార్యక్రమాలు కూడా ఆకట్టుకునేలా ఉంటాయి. పద్మవిభూషణ్ సద్గురు ప్రసంగం ఉంటుంది. ప్రముఖ బాలీవుడ్ డ్యాన్సర్ శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేశాము. ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ మ్యూజికల్ నైట్ హైలైట్‌గా నిలవనున్నది.
జూలై 3వ తేదీన జరిగే ముఖ్య కార్యక్రమాలు..
జూలై 3వ తేదీ ఆదివారం, ఉదయం 8 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే శ్రీనివాస కళ్యాణహోత్సవం జరుగుతుంది. డా. శోభారాజు గాన విభావరి ఉంటుంది. నీహార్ బృందం వారిచే అన్నమయ్య, రామదాసు కీర్తనల ఆలాపన ఉంటుంది. ఆరోజు సాయంత్రం అందరూ ఎదురు చూస్తున్న మ్యూజికల్ మేస్ట్రో ఇళయరాజా సంగీత విభావరి ఉంటుంది.
దీంతోపాటు బ్రేక్ ఔట్ సెషన్స్‌లలో కూడా వివిధ కార్యక్రమాలు ఉంటాయి.
రెండు రోజులు అనేక బ్రేక్ ఔట్ సెషన్స్ ఉంటాయి. ఒక పక్క సాహిత్య కార్యక్రమాలు, ఇంకోవైపు మహిళల ఫోరం కార్యక్రమాలు, సయ్యందిపాదం, రaుమ్మంది నాదం పోటీలు, అందాల పోటీలు జరుగుతాయి.
సెలబ్రిటీల గోల్ఫ్ టోర్నమెంట్
జూలై 1వ తేదీన గోల్ఫ్ టోర్నమెంట్ జరుగు తుంది. దానికి కపిల్ దేవ్, రకుల్ ప్రీత్ సింగ్, ముఖ్య అతిధులుగా వస్తు న్నారు. యూత్ క్రికెట్ టోర్నమెంట్ కూడా జరుగుతుంది. దానికి సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్ ముఖ్య అతిధులుగా వస్తున్నారు. ఇక్కడ ఉన్న పిల్లలకు స్పోర్ట్స్ విషయాల్లో కూడా అవగాహన ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ టోర్నమెంట్‌లను ఆటా ఏర్పాటు చేసింది.
ఇతర కార్యక్రమాలు
దీంతోపాటు బ్రేక్ ఔట్ సెషన్స్‌లలో కూడా వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశాము.
* రెండురోజులు అనేక బ్రేక్ ఔట్ సెషన్స్ ఉంటాయి. ఒక పక్క సాహిత్య కార్యక్రమాలు, ఇంకోవైపు మహిళల ఫోరం కార్యక్రమాలు, సయ్యంది పాదం, రaుమ్మంది నాదం పోటీలు, అందాల పోటీలు జరుగుతాయి.
* జూలై 1వ తేదీన గోల్ఫ్ టోర్నమెంట్ జరుగు తుంది. దానికి కపిల్ దేవ్, రకుల్ ప్రీత్ సింగ్, ముఖ్య అతిధులుగా వస్తున్నారు. యూత్ క్రికెట్ టోర్నమెంట్ కూడా జరుగుతుంది. దానికి సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్ ముఖ్య అతిధులుగా వస్తున్నారు. ఇక్కడ ఉన్న పిల్లలకు స్పోర్ట్స్ విషయాల్లో కూడా అవగాహన ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ టోర్నమెంట్‌లను ఆటా ఏర్పాటు చేసింది.
* ఆటా కాన్ఫరెన్స్‌లో బిజినెస్ కాన్ఫరెన్స్‌ను కూడా ఏర్పాటు చేశా ము. వ్యాపార, వాణిజ్య రంగంలో నిష్ణాతులైన వారి ప్రసంగాలతోపాటు వారి ద్వారా స్ఫూర్తిని పొందేలా కార్య క్రమాలను కూడా తయారు చేశారు. జూలై 2వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి జూలై 3వ తేదీ 5 గంటల వరకు ఈ బిజినెస్ కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో పలువురు ప్రముఖులు పాల్గొంటున్నారు.
* ఆటా మహాసభల్లో తెలుగు యువతీ యువకులకోసం ప్రత్యేకంగా వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు, అబ్బాయిలు తమ పేర్లను రిజిష్టర్ చేసుకుంటే వారిని ఈ మేట్రిమోనియల్ వేదికపై తీసుకెళ్ళి వివాహ సంబంధాలు నిశ్చయం చేసుకునేందుకు అవకాశాన్ని కలగజేయనున్నారు.
* సీనియర్ సిటిజన్ల కోసం ఆటా మహాసభల్లో ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశాము. ఇందులో భాగంగా సీనియర్ సిటిజన్లకు అవసరమైన వైద్యసహాయం ఇతర విషయాలపై ఈ మహాసభల్లో సూచనలు అందజేయడం జరుగుతుంది.
* ఉమెన్స్ ఫోరం ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలను కూడా మహిళలకోసం ప్రత్యేకంగా నిర్వహిస్తున్నాము. వారు అన్నీ రంగాల్లో ముందుకుపోయే విధంగా చేపట్టాల్సిన చర్యలు, వారికి అవసరమైన వైద్యం, బిజినెస్‌లో రాణించడానికి గల అవకాశాలు ఇలా అన్ని విషయాలపై ఈ కాన్ఫరెన్స్‌లో మహిళాఫోరం ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతాయి.