ఏలూరులో ఆకట్టుకున్న ఆటా సాంస్కృతిక కళావైభవం
అమెరికా తెలుగు సంఘం (ఆటా), హిందూయువజన సంఘం (వై.ఎమ్.హెచ్.ఎ), తంజావూర్ దక్షిణ ప్రాంత సాంస్కృతిక మండలి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆటా సాంస్కృతిక కళా వైభవం’ అందరినీ ఆకట్టుకుంది. సంగీత నృత్య ప్రదర్శనల్లో సిరిమువ్వల సవ్వడి, తప్పెట గుళ్లు, కోలాటం ప్రదర్శనలతో ఏలూరు వైఎంహెచ్‌ఎ ప్రాంగణం హోరెత్తింది. సాహిత్య అకాడమి చైర్మన్ పిల్లంగోళ్ళ శ్రీలక్ష్మి జ్యోతి ప్రజ్వలన చేసి కళావైభవాన్ని ప్రారంభించారు. మొదట నాగస్వరంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. డప్పు నృత్యం, కోలాటం, పగటి వేషాలు, జానపద నృత్యాలు, కర్ణాటక సంగీత కచేరి, ఏకపాత్రాభినయం, కూచిపూడి నాట్యాలు చూపరులను మంత్రముగ్దులను చేశాయి. కూచిపూడి మోహిని అట్టం ప్రేక్షకులను మైమరిపించింది.
చాట్రగడ్డ శ్రీనివాసులు బృందం చల్లపల్లి వారిచే డప్పు నృత్యం శ్రీరామలింగేశ్వర భక్తమండలి, సూర్యకుమారి, ఏలూరు వారి బృందం వారిచే కోలాటం కీర్తన కల్చరల్ సొసైటీ ఎం.ప్రశాంత్ కుమార్ బృందం వారిచే పగటి వేషాలు ప్రశాంత్ కుమార్ బృందం జంగారెడ్డి గూడెం వారిచే జానపద నృత్యం ప్రముఖ జానపద గాయకుడు దామెదర గణపతి బృందం చే జానపద నృత్యాలు రేలా రే రే రేలా జయహో జానపదం ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వారిచే కర్ణాటక సంగీత కచేరీ ప్రముఖ గాయకుడు మోహన్ బృందం, భీమవరం వారిచే సినీ సంగీత విభావరి డి.దుర్గాప్రసాద్, తనకు వారిచే దుర్యోధన ఏక పాత్రాభినయం సి. అజ్ కుమార్ బృందంచే కూచిపూడి నృత్యం మధుర పంతుల సీతాలక్ష్మీ ప్రసాద్ పసుమర్తి మృత్యుంజయ శర్మలచే కూచిపూడి నృత్యాలు అందరినీ అలరించాయి.
ఆటా ప్రెసిడెంట్ ఎలక్ట్, ఆటా వేడుకల చైర్ మధు బొమ్మిరెడ్డి, ఆటా ట్రస్టీ శారదా సింగిరెడ్డి, ఆటా వేడుకల కో చైర్, పాలకమండలి సభ్యుడు అనిల్ బొద్దిరెడ్డి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.