ASBL Koncept Ambience

ఆటా ఎడ్యుకేషనల్ సెమినార్ కు సబితా ఇంద్రారెడ్డి

ఆటా ఎడ్యుకేషనల్ సెమినార్ కు సబితా ఇంద్రారెడ్డి

ఆటా వేడుకల్లో భాగంగా డిసెంబర్‌ 23వ తేదీన హైదరాబాద్‌లోని మేరీగోల్డ్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషనల్‌ సెమినార్‌కు ముఖ్య అతిధిగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి హాజరవుతున్నారు. గెస్ట్‌ ఆఫ్‌ హానర్‌గా హైదరాబాద్‌లోని యుఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌ జోయెల్‌ రిట్‌మాన్‌ వస్తున్నారు. ఈ విద్యాసదస్సులో స్టూడెంట్‌లకు, పేరెంట్స్‌కు అమెరికా విద్యావ్యవస్థపై అవగాహన కల్పించనున్నారు. అమెరికా కాలేజీల్లో అడ్మిషన్‌ల వ్యవస్థ, అడ్మినిస్ట్రేషన్‌ ఎలా ఉంటుందో కూడా వివరించనున్నారు. యుఎస్‌ కాలేజీలను ఎలా   ఎంపిక చేసుకోవాలో ఐ20, యుఎస్‌ వీసా ఇతర విషయాలను కూడా ఈ సెమినార్‌లో తెలియజేయనున్నారు.

ఈ సదస్సులో కాన్సల్‌ జనరల్‌ జోయెల్‌ రిఫ్‌మాన్‌తోపాటు, తెలంగాణ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ వెంకట రమణ, న్యూయార్క్‌లోని న్యూయార్క్‌ స్టేట్‌ యూనివర్సి ఫ్యాషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ రిజిస్ట్రార్‌గా ఉన్న ప్రొఫెసర్‌ రాజశేఖర్‌ రెడ్డి వంగపతి తదితరులు ఇందులో వక్తలుగా ప్రసంగించనున్నారు. ఈ ఎడ్యుకేషన్‌ సెమినార్‌కు స్టూడెంట్‌లు, వారి తల్లితండ్రులు అందరూ హాజరుకావాలని నిర్వాహకులు కోరుతున్నారు.

 

Tags :