చిట్యాలలో ఆటా ఉచిత వైద్యశిబిరానికి మంచి స్పందన
అమెరికా తెలుగు సంఘం తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ఆటా వేడుకల కార్యక్రమంలో భాగంగా సామ సుచరిత, కౌశిక్‌రెడ్డి సహకారంతో చిట్యాలలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. ఈ వైద్యశిబిరాన్ని నకిరేకల్ ఎమ్యేల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రవాస భారతీయులు మాతృభూమిపై మమకారం కొనసాగించాలని, అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ప్రజలు తమ ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం వహించవద్దని కోరారు.
ఆటా అధ్యక్షుడు భువనేశ బూజాల మాట్లాడుతూ ఆటా ఆధ్వర్యంలో మూడు దశాబ్దాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడమే గాకుండా, తెలుగు సంస్కృతి సంప్రదాయాలు కాపాడుతున్నట్లు తెలిపారు.
ఆటా ప్రెసిడెంట్ ఎలక్ట్, వేడుకల చైర్ మధు బొమ్మినేనితోపాటు ఆటా నాయకులు శారద సింగిరెడ్డి, సుధీర్ బండారు, మయూర్‌రెడ్డి బండారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మహిళలకు గర్భాశాయ, రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి పరీక్షలు చేసుకున్నారు.