ASBL Koncept Ambience

బధిరుల పాఠశాలకు ఆటా విరాళం

బధిరుల పాఠశాలకు ఆటా విరాళం

అమెరికా తెలుగు సంఘం (ఆటా) మాతృరాష్ట్రాల్లో నిర్వహిస్తున్న వేడుకల్లో భాగంగా సాంస్కృతిక, వైద్య, విద్యా, నైపుణ్యాభివృద్ధి, ఉపకారవేతనాలు, వాణిజ్యం తదితర రంగాలపై  సదస్సులు కార్యక్రమాలను ఆట నిర్వహించింది. సేవా రంగ కార్యక్రమాల్లో భాగంగా ఆటా నాయకులు హైదరాబాద్‌లోని బధిరుల పాఠశాలను సందర్శించారు. ఆటా అధ్యక్షుడు భీంరెడ్డి పరమేష్‌, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ భువనేశ్‌ బూజాలల ఆధ్వర్యంలోని ఆటా బృందం సందర్శించి అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు. రెండంతస్థులు కలిగిన ఈ భవనంలో 5గదుల్లో 17మంది అధ్యాపకులతో కలిసి 110కు పైగా బాలబాలికలు నివసిస్తూ, విద్యనభ్యసిస్తూ ఆశ్రయం పొందుతున్నారని, నెలకి 3లక్షల రూపాయలు ఖర్చు అయ్యే ఈ పాఠశాలలోని వసతుల మెరుగునకు ఆటా ఆధ్వర్యంలో చేయూతనిస్తామని పరమేశ్‌ తెలిపారు. తొలివిడతగా లక్ష రూపాయలను ఆటా నాయకులు అందజేశారు. వీరికి స్పీచ్‌ థెరపీ ద్వారా విద్యా బోధన జరిగేలా సాయమందిస్తామని, 2లక్షల రూపాయలు ఖరీదు చేసే ఆ థెరపీ కిట్‌ను అందజేస్తామని భువనేశ్‌ తెలిపారు. ఆటా నాయకుల సహాయానికి అందరూ ధన్యవాదాలు తెలిపారు.

Click here for Event Gallery

 

Tags :