విభిన్నంగా ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సు
అమెరికా తెలుగు సంఘం ఆటా వేడుకల్లో భాగంగా నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ వద్దనున్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలోని డా. నందమూరి తారక రామారావు కళామందిరంలో ఆటా సాహిత్య ప్రయాణం-శ్రవణం-భాషణం-పఠనం-లేఖనం ప్రధానాంశాలుగా ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సు 2023ని వైభవంగా వైవిద్యభరితంగా నిర్వహించనున్నట్లు ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని, అధ్యక్షుడు, వేడుకల చైర్ ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా, వేడుకల కో చైర్ వేణు సంకినేని, లిటరరీ కమిటీ చైర్ వేణు నక్షత్రం, రాజేశ్వరరావు తెలిపారు. ఈ నెల 17 అదివారం ఉదయం 9:30 నుండి రాత్రి వరకు ఈ సదస్సు జరుగుతుంది.
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షుడు కొలకలూరి ఇనాక్ సభాధ్యక్షతన ముఖ్య అతిథిగా నందిని సిధారెడ్డి సదస్సును లాంఛనంగా ప్రారంభిస్తారని, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య కిషన్ రావు అధ్యక్షతన జరిగే ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జూలూరి గౌరీశంకర్, మంత్రి శ్రీదేవి, విశిష్ట అతిథులుగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ పాల్గొంటారని తెలిపారు.
ఈ సందర్భంగా జరిగే సాహిత్య కార్యక్రమంలో శాంతిస్వరూప్, ఐనంపూడి లక్ష్మి, జె.శ్రీనివాస్, సంగిశెట్టి దెంచనాల శ్రీనివాస్, కొలకలూరి మధుజ్యోతి, నరాల రామిరెడ్డి, కొండపల్లి నీహారిణి, టి. గోపాల్ రెడ్డి, మధురాంతకం నరేంద్ర, మధుబాబు, పి.అశోక్ కుమార్, వెంకట్రామిరెడ్డి, మహ్మద్‌గౌస్, హుమయూన్ సంఫ్నీర్, పత్తిపాక మోహన్, ఎస్వీ సత్యనారాయణ, మువ్వా శ్రీనివాసరావు, నాళేశ్వరం శంకరం, ఏనుగు నరసింహారెడ్డి, ఎం.హైమవతి, కందుకూరి శ్రీరాములు, జుల్లేపల్లి బ్రహ్మం, యాకూబ్, వెల్దండి శ్రీదర్, రవీందర్, గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్‌తేజ దేశపతి శ్రీనివాస్, పెంచలదాస్, రామప్రసాదరెడ్డి, బలగం వేణు, అల్లాణి శ్రీధర్, మామిడి హరికృష్ణ, మహ్మద్ షరీప్ తదితరులు పాల్గొంటారని వారు వివరించారు.