ASBL Koncept Ambience

సినిమా సాహిత్యాల కలయికగా సాగిన ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సు

సినిమా సాహిత్యాల కలయికగా సాగిన ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సు

అమెరికా తెలుగు సంఘం ప్రతి రెండేళ్లకోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే ఆటా వేడుకల్లో భాగంగా డిసెంబర్‌ 11 శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు హైదరాబాద్‌ లక్డీకాపూల్‌ లోని బెస్ట వేస్ట్రన్‌ అశోకలోని కాన్ఫరెన్స్‌ హాల్లో అంతర్జాతీయ సాహితీ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు ప్రారంభ సమావేశంలో కే.శివారెడ్డి, నందిని సిద్ధారెడ్డి, బి.నర్సింగరావు ప్రారంభోత్స ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో ఆటా అధ్యక్షులు భువనేశ్‌ బూజాల, ఆటా ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌, ఆటా వేడుకలు ఆటా సేవ్‌ డేస్‌ చైర్‌ మధు బొమ్మినేని, ఆటా సేవా డెస్‌ కో చైర్‌ అనిల్‌ బొద్దిరెడ్డి, ఆటా సేవా డేస్‌ కో చైర్‌ శరత్‌ వేముల, ఆటా సాహితి సదస్సు చైర్‌ రవి విరేళ్లి పలువురు ప్రముఖులు హాజరైయ్యారు.

ఆ తర్వాత తెలుగు కథ స్క్రీన్‌ ప్లే నేపథ్యంగా సి.ఉమామహేశ్వర రావు నిర్వహణలో జరిగే సమావేశంలో లక్ష్మీ భూపాల, వేణు ఉడుగుల, కరుణ కుమార్‌, లక్ష్మీ సౌజన్య, ఉదయ్‌ గుర్రాల, అపర్ణ కొల్లూరు పాల్గొని, సినిమా కథకి సాహిత్యానికి ఉన్న అనుబంధ గురించి వారి వారి ఆలోచనలు పంచుకున్నారు. 

మధ్యాహ్నం కుప్పిలి పద్మ నిర్వహణలో జరిగిన "మన కాలపు నవల" సమావేశంలో బండి నారాయణస్వామి, మధురాంతకం నరేంద్ర, బొమ్మదేవర నాగకుమారి ఉణుదుర్తి సుధాకర్‌ పాల్గొన్నారు.  

ఆ తర్వాత అనంతు నిర్వహణలో జరిగిన అణువాదం-అవసరం సమావేశంలో ఎలనాగ, అరిపిరాల సత్యప్రసాద్‌, అవినేని భాస్కర్‌, ఆదిత్య కొర్రపాటి అనువాదం అవసరం గురించి అనువాదంలో ఉన్న సమస్యలను గురించి చర్చించారు. 

సదస్సు చివరి అంశంగా కవిత్వ కాన్వాసుపై కొత్త రంగులు అనే శీర్షికతో కోడూరి విజయ్‌ కుమార్‌ నిర్వహణలో కవి సమ్మేళనం జరిగింది. ఇందులో మాన మానస చామర్తి, తుగుళ్ళ గోపాల్‌, సిద్ధార్థ కట్ట, అరుణాంక్‌ లత, రమేష్‌ కార్తీక్‌ నాయక్‌, నస్రీన్‌ ఖాన్‌, పల్లిపట్టు నాగరాజు, నాగిళ్ళ రమేష్‌, తండి హరీష్‌ గౌడ్‌, పద్మజ బొలిశెట్టి, మువ్వ జయశ్రీ, జుజ్జూరి వేణుగోపాల్‌ పాల్గొన్నారు. కవితాగానం చేశారు.

మళ్లీ 2023 డిసెంబర్‌లో కూడా ఈ సాహిత్య సదస్సులు నిర్వహించనున్నట్లు ఆటా అధ్యక్షులు భువనేష్‌ బూజాల, ఆటా వేడుకల అధ్యక్షురాలు మధు బొమ్మినేని తెలియజేశారు. ఇందులో భాగంగా ఆటా ప్రతినిధులు కాశి కొత్త, సుధిర్‌ బండారు, శారధ సింగిరెడ్డి, శ్రీకాంత్‌ గుడిపాటి, కరుణాకర్‌ ఆసీరెడ్డి, జ్యోత్స్య రెడ్డి, జోతిర్మయిరెడ్డి, వెంకటేశ్వరరావు పలువురు ప్రముఖులు హాజరైయ్యారు. సాహితీ ప్రియులందరూ సభల్లో పాల్గొని ఆటా అంతర్జాతీయ సదస్సు సాహితీ సదస్సులో విజయవంతం చేశారని, ఆటా సాహితీ సదస్సు కోరారు.

Click here for Photogallery

 

Tags :