ASBL Koncept Ambience

ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సు డిసెంబర్ 11న

ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సు  డిసెంబర్ 11న

తెలుగు రాష్ట్రాల్లో ఆటా నిర్వహిస్తున్న ఆటా వేడుకలు కార్యక్రమంలో భాగంగా డిసెంబర్‌ 11వ తేదీన ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సును డిసెంబర్‌ 11వ తేదీన ఏర్పాటు చేసింది. ఆటా అక్షరాల బాట పేరుతో ఏర్పాటు చేసిన ఈ సాహితీ సదస్సులో ఎంతోమంది సాహితీ ప్రముఖులు పాల్గొంటున్నారు. వ్యాఖ్యాతలుగా మానస, నందకిశోర్‌ వ్యవహరిస్తున్నారు. ఆటా సభా కార్యక్రమాల్లో కె. శివారెడ్డి, బి. నర్సింగరావు, నందిని సిదారెడ్డి వంటివారు హాజరవుతున్నారు. తెలుగు కథ, స్క్రీన్‌ప్లే అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లక్ష్మీ భూపాల, కరుణకుమార్‌, వేణు ఉదుగుల, లక్ష్మీ సౌజన్య, ఉదయ్‌ గుర్రాల, పూజ కొల్లూరు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉమామహేశ్వరరావు నిర్వహిస్తున్నారు.

మనకాలపు నవల పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మధురాంతకం నరేంద్ర, బండి నారాయణస్వామి, బొమ్మదేవర నాగకుమారి, ఉణుదుర్తి సుధాకర్‌ పాల్గొంటున్నారు. కుప్పిలి పద్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనున్నది. అనువాదం..అవసరం? అన్న అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదిత్య కొర్రపాటి, ఎలనాగ, అరిపిరాల సత్యప్రసాద్‌, అవినేని భాస్కర్‌  పాల్గొంటున్నారు. అనంతు దీనిని నిర్వహిస్తున్నారు. కవిత కాన్వాసుపై కొత్త రంగులు కార్యక్రమంలో మానస చామర్తి, తగుళ్ళ గోపాల్‌, సిద్దార్థ కట్ట, అరుణాంక్‌ లత, రమేష్‌ కార్తీక్‌ నాయక్‌, నస్రీన్‌ ఖాన్‌, పళ్ళిపట్టు నాగరాజు, నాగిళ్ళ రమేష్‌, తండ హరీష్‌ గౌడ్‌, పద్మజ బొలిశెట్టి, మువ్వ జయశ్రీ, జుజ్జురి వేణుగోపాల్‌ పాల్గొంటున్నారు. నిర్వహణ కోడూరి విజయ్‌కుమార్‌.

 

Tags :