ASBL Koncept Ambience

మంత్రి ఎర్రబెల్లికి ఆటా ఆహ్వానం

మంత్రి ఎర్రబెల్లికి ఆటా ఆహ్వానం

అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో ఈనెల 26న నర్సంపేటలో ఉద్యోగ మేళా, నైపుణ్యాభివృద్ధి (స్కిల్‌ డెవలప్‌మెంట్‌) కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును ఆటా ప్రతినిధులు నర్సింహా రెడ్డి, అనిల్‌, ఈశ్వర్‌రెడ్డి కోరారు. ఈ నెల 29న రవీంద్రభారతిలో జరిగే సాంస్కృతిక కార్యక్రమానికి రావాలని విన్నవించారు. అలాగే 2020 జూలై 3 నుంచి 5 వరకు లాస్‌ ఏంజెలిస్‌లో జరిగే ఆటా మహాసభలకూ హాజరుకావాలని ఆహ్వానించారు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేసే అవకాశం కొందరికే దక్కుతుందని, ఈ విషయంలో ఎంపీవోలు అదృష్టవంతులని ఎర్రబెల్లి అన్నారు. ఎంపీవోలుగా నియమితులైన 63 మందికి శిక్షణ ముగింపు కార్యక్రమం టీఎస్‌ఐఆర్‌డీలో జరిగింది. ఎర్రబెల్లి మాట్లాడుతూ అధికారులకు సామాజిక స్పృహ ఉంటే మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.

 

 

Tags :