అట్టహాసంగా జరిగిన "ఆటా" ఝుమ్మంది నాదం సెమి ఫైనల్స్ పాటల పోటీలు
అమెరికా తెలుగు సంఘం (ఆటా) “ఝుమ్మంది నాదం” సెమి ఫైనల్స్ పాటల పోటీలను జూమ్ లో నిర్వహించింది. భువనేశ్ బూజల ప్రెసిడెంట్, సుధీర్ బండారు కన్వీనర్, కిరణ్ పాశం కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో, బోర్డు అఫ్ ట్రస్టీస్ రామక్రిష్ణా రెడ్డి ఆల అడ్వైసర్ గా, శారదా సింగిరెడ్డి చైర్ గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇండియా నుండి ప్లే బ్యాక్ సింగర్ మరియు సంగీత దర్శకులు, శాస్త్రీయ సంగీత విద్వాంసులు శ్రీ. నిహాల్ కొండూరి, ప్లే బ్యాక్ సింగర్ శ్రీ నూతన మోహన్, శాస్త్రీయ సంగీత విద్వాంసులు డా. టి.కె.సరోజ గారు, లిరిసిస్ట్ శ్రీ చంద్రబోస్, లిరిసిస్ట్ శ్రీ రామజోగయ్య శాస్త్రి నాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. “ఝుమ్మంది నాదం” సెమి ఫైనల్స్ పాటల పోటీల లో అమెరికాలోని 18 రాష్ట్రాలనుండి 89 మంది గాయని గాయకులు సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ ఏజ్ కేటగిరీలలో శాస్త్రీయ, లలితసంగీతం రెండు విభాగాల పాటల పోటీలలో పాల్గొనగా 37 మంది గాయని గాయకులు “ఫైనలిస్ట్స్ గా” ఎంపిక అయ్యారు. వీరు అమెరికా తెలుగు సంఘం (ఆటా) 17 వ కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ వాల్టర్ యీ కన్వెన్షన్ సెంటర్ , వాషింగ్టన్ డీసీ లో వారి ప్రతిభను ఫైనల్స్ లో శనివారం జులై 2, 2022 న చాటబోతున్నారు. సంగీత ప్రియులందరికీ ఆటా కార్యవర్గ బృందం ఆటా ఐకానిక్ ప్రోగ్రాం అయిన ఝుమ్మంది నాదం పాటల పోటీల కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతుంది.
కాన్ఫరెన్స్ వివరాలు...
అమెరికా తెలుగు సంఘం(ఆటా) 17వ మహాసభలు అందరి తెలుగు వారి పండుగ కావున అమెరికా రాజధాని నగరం నడిబొడ్డున వాషింగ్టన్ డి సి లో మూడు రోజుల పాటు మహాసభలకు 15,000 పైగా హాజరయ్యే విధంగా న భూతో న భవిష్యతి లాగా నిర్వహించటానికి పద్మవిభూషణ్ సద్గురు, పద్మవిభూషణ్ మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా, కమలేష్ D.పటేల్, విజయ్ దేవరకొండ, డిజె టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్,సంగీత దర్శకుడు తమన్, రామ్ మిర్యాల, మంగ్లీ, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్ ,GMR,ఉపాసన కొణిదెల, Dr.MSN Reddy,ప్రముఖ కవులు, కళాకారులు,సినీ ప్రముఖులు, మరియు తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది రాజకీయ నాయకులు విచ్చేస్తున్న ఈ మహాసభలకు అమెరికా లో వున్న తెలుగువారందరూ హాజరై భారీ స్థాయిలో విజయవంతం చేయాలని June 15,2022 వరకు 50% off Early Bird discounted price ఇవ్వటం జరుగుతుంది.
Visit www.ataconference.org/buy-tickets