ASBL Koncept Ambience

ఆటా వేడుకలకు గవర్నర్‌కి ఆహ్వానం

ఆటా వేడుకలకు గవర్నర్‌కి ఆహ్వానం

అమెరికా తెలుగు సంఘం డిసెంబర్‌ 10 నుండి 30 వరకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఆరోగ్య, విద్య, సాహిత్య, సాంస్కృతిక, వ్యాపార, ఆధ్యాత్మిక, క్రీడా రంగాలకు సంబంధించి నిర్వహిస్తున్న ‘ఆటా’ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ వేడుకలకోసం ఇప్పటికే ఆటా ముఖ్య నాయకులు అందరూ ఇప్పటికే ఇండియా చేరుకున్నారు. ఈ వేడుకలకు రావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ను ఆటా ఉపాధ్యక్షులు జయంత్‌ చల్లా, కాన్ఫెడరేషన్‌ అఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సిఐఐ)తెలంగాణ ఛైర్‌ సి. శేఖర్‌ రెడ్డి, ఆటా బిజినెస్‌ చైర్‌ లాక్స్‌ చేపూరి కలుసుకుని ఆహ్వానించారు.

హైదరాబాద్‌ లోని రాజ్‌ భవన్‌ లో గవర్నర్‌ ను కలిసి సేవాడేస్‌ గురించి వివరించగా, ఆటా మరియు సిఐఐ కలిసి హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న బిజినెస్‌ సెమినార్‌ కి హాజరవడానికి సుముఖత చూపినట్లు తెలిసింది. వచ్చే జూన్‌ 7, 8, 9 లలో అట్లాంటా మహానగరంలో నిర్వహించబోయే ఆటా కన్వెన్షన్‌ కి ముందుగా ఈ ఆటా వేడుకల కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నిర్వహించడం ఆనవాయితీ. ఈ వేడుకలకు అందరూ రావాలని వేడుకలకు ఆటా ప్రెసిడెంట్‌ మధు బొమ్మినేని, వైస్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ చల్లా కోరారు.

 

 

Tags :