ASBL Koncept Ambience

ఆటా సాహిత్య సదస్సు

ఆటా సాహిత్య సదస్సు

ఆటా 17వ మహాసభల్లో భాగంగా సాహిత్య సదస్సును నిర్వాహకులు ఏర్పాటు చేశారు. జూలై 2 మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 వరకు రూమ్‌నెం. 202ఎలో సాహిత్య సదస్సు ప్రారంభ సమావేశం జరగనున్నది. ఇందులో కే .శ్రీనివాస్‌, కసిరెడ్డి వెంకట రెడ్డి, ప్రభావతి రెడ్డి, అఫ్సర్‌, స్వామి వెంకట యోగి పాల్గొంటారు.

మధ్యాహ్నం 2.30 నుంచి 3 వరకు పారడి పాటలు కార్యక్రమం జరుగుతుంది. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు తనదైన శైలిలో పారడి పాటలు పాడి ఆనందింపజేయనున్నారు. ఆతరువాత 3 నుంచి 5 వరకు మనకాలపు నవల, కథ కార్యక్రమం జరుగుతుంది. కల్పన రెంటాల, చంద్ర కన్నెగంటి, ఆరి సీతారామయ్య, శివకుమార శర్మ తాడికొండ, సాయి గొర్తి బ్రహ్మానందం, పద్మవల్లి, ధీరజ్‌ కశ్యప్‌ ఇందులో పాల్గొంటున్నారు.

3వ తేదీ ఉదయం 10 నుంచి 12 వరకు ఆటా అవధాన కార్యక్రమం జరుగుతుంది. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్‌ అవధానం చేయనున్నారు. సంచాలకులుగా రావు తల్లాప్రగడ వ్యవహరిస్తారు. సమస్య ` సురేష్‌ కొలిచాల, దత్తపది`ఆనంద్‌ కూచిభొట్ల, వర్ణనము ` మాధురి చింతపల్లి, నిషిద్దాక్షరి` ప్రకాశరావు కొల్లారపు, న్యస్తాక్షరి ` తుమ్మలపల్లి వాణీకుమారి, అశువు`రెజీనా గుండ్లపల్లి, పురాణ పఠనం ` లెనిన్‌ వేముల, అప్రస్తుత ప్రసంగం ` తనికెళ్ళ భరణి ఉంటారు.

మధ్యాహ్నం 1.30 నుంచి 2.30 వరకు ఆటా, పాటా మనం (పాట నేపథ్యం) విషయంపై కార్యక్రమం జరుగుతుంది. సినిమా రచయితలు చంద్రబోసు, రామజోగయ్య శాస్త్రి పాల్గొంటారు. 2.30 నుంచి 3వరకు పుస్తకాల ఆవిష్కరణ జరుగుతుంది. తరువాత 3 నుంచి 5 వరకు సినిమా కథలు` సాహిత్య నేపథ్యం అన్న అంశంపై కార్యక్రమం జరుగుతుంది. శేఖర్‌ కమ్ముల, సందీప్‌ వంగ, తనికెళ్ళ భరణి, రాజ్‌ రాచకొండ, ధర్మ దోనేపూడి, సమన్వయం శివ సోమయాజుల చేస్తారు.

సాహిత్య కమిటీకి రవి వీరెల్లి చైర్‌గా వ్యవహరిస్తున్నారు.

 

Tags :