సీఎం జగన్ ను కలిసిన ఆటా నాయకులు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ప్రతినిధులు సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసి ఆటా తెలుగు మహాసభలకు ఆహ్వానించారు. వాషింగ్టన్ డీసీ జూలై 1 నుంచి 3 వరకు 17వ ఆటా తెలుగు మహాసభలు జరగనున్నాయి. ఆటా ప్రెసిడెంట్ భువనేష్ బూజల, ఆటా సెక్రటరీ, నార్త్ అమెరికాలో ఏపీ ప్రభుత్వ సలహాదారు హరిప్రసాదరెడ్డి లింగాల, ఆటా ఫైనాన్స్ కమిటీ ఛైర్మన్ సన్నీరెడ్డి, ఆటా అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ జయంత్ చల్లా ముఖ్యమంత్రిని కలిసి కాన్ఫరెన్స్‌కు రావాల్సిందిగా స్వయంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆటా అమెరికాలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ నిర్వహిస్తున్న కార్యక్రమాలను ముఖ్యమంత్రికి వివరించారు.
Tags :