ఎమ్మెల్సీ కవితను ఆటా సభలకు ఆహ్వానించిన సభ్యులు
17 వ ఆటా (American Telugu Association) మహాసభలు వాషింగ్షన్ డీసీ లో జులై 1 నుంచి 3 వరకు ప్రారంభం కానున్నాయి, ఈ రోజు తెరాస ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల గారితో కలిసి ఆటా ప్రతినిధుల బృందం ఈ మహా సభలకు ఎమ్మెల్సీ కవితను ఆహ్వానించారు.
ఆటా ప్రతినిధులు మాట్లాడుతూ ఈ సారి అమెరికా నలుమూలల నుంచి దాదాపు 15000 మంది పాల్గొంటునట్టు నిర్వాహకులు చెప్పారు. అలాగే ఈ సారి తెలంగాణ రాష్ట్ర పెవిలియన్ ని ఏర్పాటు చేయనున్నట్టు అందులో మన వూరు-మన బడి, బతుకమ్మ, తెలంగాణ టూరిజం మరియు వివిధ రకాల ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. ముందు తరానికి మన బతుకమ్మ విశిష్టత గురించి తెలియపరిచెట్టు బతుకమ్మ పై ఇంగ్లీష్ లో పుస్తకాన్ని ముద్రిస్తున్నట్టు తెలిపారు. తమ ఆహ్వానాన్ని స్వీకరించినందుకు కవిత గారికి ఆటా సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ కవిత గారిని ఆహ్వానించినా వారిలో ఆట అధ్యక్షులు భువనేశ్ భుజాల, శరత్ వేముల, జయంత్ చల్ల, వేణు సంకినేని తదితరులు వున్నారు.