ASBL Koncept Ambience

'ఆటా' ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీ

'ఆటా' ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీ

ఆటా ఆధ్వర్యంలో మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో లైబ్రరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆటా వేడుకల చైర్, ఎలక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా మాట్లాడుతూ.. తాము కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకొని ఉన్నతంగా ఎదిగామని, ఇక్కడి విద్యార్థులు కూడా అలానే ఎదగాలని ఆకాంక్షించారు. చదువుకునే పిల్లలు ఫోన్లకు, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు.

అమెరికా, భారత్లోని పాఠశాలల మధ్య తేడాలను ఆయన వివరించారు. ఇతర CSIR కంపెనీ లతో ఆటా మాట్లాడి వారి సహకారంతో స్కూల్ను మరింత అభివృద్ది చేస్తామన్నారు. అలాగే అక్కడ ఆట స్థలం, డిజిటల్ కంప్యూటర్ల సమస్య ఉందని విద్యార్థులు అడుగగా, స్థానిక ఎమ్మెల్యే, ఇతర CSIR కంపెనీ లతో ఆటా మాట్లాడి వారి సహకారంతో స్కూల్ ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, స్కూల్ కు, ఆటా కు మధ్య సమన్వయ కర్తగా వ్యవహరించిన జ్యోత్స్న బొబ్బాల ను ఈ సందర్భంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి, 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ ట్రెజరర్ రవీందర్ గూడూరు, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, పాస్ట్ ప్రెసిడెంట్ కరుణాకర్ మాధవరం, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నరసింహారెడ్డి ద్యాసాని, కాశీ కొత్త, రాజ్ కక్కెర్ల, ఆటా ఇండియా కో ఆర్డినేటర్స్ అమృత్ ముళ్ళపూడి, డా.సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Click here for Photogallery

 

 

 

Tags :