ఆటా కాన్ఫరెన్స్ కు కిషన్ రెడ్డిని ఆహ్వానించిన భువనేశ్ బుజాల
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జూలై 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించనున్న ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్ ) 17వ మహా సభలు, యూత్ కన్వెన్షన్ కు అతిథిగా రావాల్సిందిగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు భువనేశ్ భుజాల ఇతర కార్యవర్గ సభ్యులు కలిశారు. జులై 1వ తేదీ నుండి వాషింగ్టన్ డి.సి లో జరుగుతున్న ఆటా మహాసభలకు హాజరు కావలసిందిగా ఆహ్వానం అందించారు. దీనికి మంత్రి కిషన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఆటా నాయకులు శరత్ వేముల, హరీ లింగాల, రఘువీర్ రెడ్డి, హరి దామెర, జయంత్ చల్ల, సన్నీరెడ్డి తదితరులు కిషన్ రెడ్డిని కలిసిన వారిలో ఉన్నారు.
Tags :