ASBL Koncept Ambience

విజయవాడలో ఆర్వో వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించిన ఆటా

విజయవాడలో ఆర్వో వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించిన ఆటా

విజయవాడలోని కేబిఎన్‌ కాలేజీ వద్ద ఉన్న అన్నపూర్ణ దేవి ప్రైమరీ స్కూల్‌లో ఆర్వో వాటర్‌ ప్లాంట్‌ను అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఏర్పాటు చేసింది. ఆటా మీడియా చైర్‌ భాను స్వర్గం ఈ వాటర్‌ప్లాంట్‌ను స్పాన్సర్‌ చేశారు. డిసెంబర్‌ 21వ తేదీన జరిగిన ప్రారంభ కార్యక్రమంలో ఆటా నాయకులతోపాటు రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్‌, విజయవాడ మేయర్‌ రాయన భాగ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, విదేశాల్లో ఉన్నప్పటికీ రాష్ట్రానికి మరింతగా సేవలందించేందుకు ఆటాలాంటి సంస్థలు ముందుకు రావడం, మౌలిక సదుపాయాల్లో భాగస్వామ్యం కావడంపై వారు హర్షం వ్యక్తం చేస్తూ ఎన్నారైలకు అవసరమైన సహాయాన్ని సహకారాన్ని అందించడంలో వైసిపి ప్రభుత్వం ముందుంటుందని చెప్పారు.

ఆర్వో వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన ఆటా మీడియా చైర్‌ భాను స్వర్గంను ఆటా అధ్యక్షుడు భువనేష్‌ బుజాల అభినందిస్తూ, రాష్ట్ర ప్రజలకు సేవ చేయడంలో ఆటా ఎల్లప్పుడూ ముందుంటుందని చెప్పారు.

అటా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌, ఆటా వేడుకల చైర్‌ మధు బొమ్మినేని మాట్లాడుతూ, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఆటా సేవా కార్యక్రమాలతోపాటు వేడుకలను నిర్వహిస్తోందని ఇప్పటికే చాలాచోట్ల తాము నిర్వహించిన కార్యక్రమాలకు మంచి స్పందన రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఆటా వేడుకల కో చైర్‌ అనిల్‌ బొద్దిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

 

Click here for Photogallery

 

Tags :