న్యూ జెర్సీ లో గ్రాండ్ గా జరిగిన అట సయ్యంది పాదం డ్యాన్స్ పోటీలు
జూలై 1 నుండి 3వ తేదీ వరకు వాషింగ్టన్ D.Cలో జరగనున్న 17వ ATA కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్ లో భాగంగా ATA కన్వెన్షన్ బృందం జూన్ 5, ఆదివారం న్యూజెర్సీలో ATA సయ్యంది పాదం నృత్య పోటీలను భారీ స్థాయిలో విజయవంతంగా నిర్వహించింది. కూచిపూడి, భరత నాట్యం, జానపదం మరియు ఫిల్మ్ విభాగాలలో చాలా నాణ్యమైన ప్రదర్శనలతో ఈ పోటీలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి.
కాన్ఫరెన్స్ డైరెక్టర్ రఘువీర్ రెడ్డి, విజేతలను అభినందించి గొప్ప ప్రదర్శనలు ఇచ్చినందుకు పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన న్యూజెర్సీ సయ్యంది పాదం టీమ్‌కు ఆయన అభినందనలు తెలిపారు. న్యూజెర్సీ ATA కోఆర్డినేటర్ ఇందిర రెడ్డి వాలంటీర్లకు, అట సయ్యంది పాదం ఛైర్ సుధా కొండపు , న్యూజెర్సీ ATA టీమ్ శరత్ వేముల,మహేందర్ ముసుకు,విజయ్ కుందూరు, శ్రీనివాస్ దార్గులా, రాజ్ చిలుముల మరియు రీజినల్ కోఆర్డినేటర్ సంతోష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ATA బృందం ప్రతి విభాగంలో విజేతలకు సర్టిఫికెట్లు మరియు మొమెంటోలను అందించింది. ఈ పోటీల్లో గెలిచిన రాష్ట్ర స్థాయి విజేతలు, DC జరగనున్న కన్వెన్షన్‌లో ఫైనల్స్‌లో పోటీపడతారు. ఫైనల్స్‌కు శేఖర్ మాస్టర్ న్యాయనిర్ణేతగా వ్యవహరించడం విశేషం.
న్యూజెర్సీ విజేతల వివరాలు
సోలో నాన్ క్లాసికల్ సీనియర్ – నేహా రెడ్డి వంగపాటి
సోలో నాన్ క్లాసికల్ జూనియర్ - సంజన నూకెళ్ల
సోలో సీనియర్ క్లాసికల్ – మెగానా మధురకవి
సోలో జూనియర్ క్లాసికల్ జాన్వీ ఇరివిచెట్టి
నాన్ క్లాసికల్ గ్రూప్ జూనియర్ – నిషా స్కూల్ ఆఫ్ డ్యాన్స్
నాన్ క్లాసికల్ గ్రూప్ సీనియర్ శైలా మండల స్కూల్ ఆఫ్ డాన్స్
క్లాసికల్ గ్రూప్ సీనియర్ - ఇందిరా దీక్షిత్ స్కూల్ ఆఫ్ డ్యాన్స్
గ్రూప్ జూనియర్ - చార్వి పొట్లూరి; శ్రీనికా కృష్ణన్
జడ్జీలు రధమని వరదాచారి, నీలవేణి కందుకూరి, సౌమ్య జోస్యుల, సమైన మీనన్ ప్రతి గ్రూప్‌కు న్యాయనిర్ణేతగా నిలిచారు.
సయ్యంది పదం పోటీల ఛైర్ సుధా కొండపు మరియు సలహాదారు రామకృష్ణారెడ్డి అలా వివిధ రాష్ట్రాల్లో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, సంబంధిత కార్యక్రమాలను విజయవంతం చేసినందుకు స్థానిక కోఆర్డినేటర్‌లందరికీ ధన్యవాదాలు తెలిపారు.
అమెరికన్ తెలుగు అసోసియేషన్ ATA 17వ కన్వెన్షన్ మరియు యూత్ కాన్ఫరెన్స్, మొదటిసారిగా వాల్టర్ E కన్వెన్షన్ సెంటర్‌లో జూలై 1-3, 2022 వరకు వాషింగ్టన్ DCలో అంగరంగ వైభవం గా జరగనుంది.
మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా తన మొత్తం ట్రూప్‌తో జూలై 3న గ్రాండ్ ఫినాలేలో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి సద్గురు జగ్గీ వాసుదేవ్ హాజరు కావడం విశేషం. విజయ్ దేవరకొండ, డిజె టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ, రకుల్ ప్రీత్ సింగ్, రామ్ మిర్యాల, మంగ్లీ, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్ మరియు రెండు తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఈ వేడుకకు విచ్చేయనున్నారు. సంగీత దర్శకుడు తమన్ జూలై 2న సంగీత కచేరీలో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ మహాసభలకు అమెరికా లో వున్న తెలుగువారందరూ హాజరై భారీ స్థాయిలో విజయవంతం చేయాలని June 15,2022 వరకు 50% off Early Bird discounted price ఇవ్వటం జరుగుతుంది.
Buy the Tickets: https://tinyurl.com/yv3u7xd8
Visit: https://www.ataconference.org/