ASBL Koncept Ambience

వాషింగ్టన్ డీసీ లో పోటా పోటీ గా జరిగిన ఆటా సయ్యంది పాదం సెమి ఫైనల్ డ్యాన్స్ పోటీలు

వాషింగ్టన్ డీసీ లో పోటా పోటీ గా జరిగిన ఆటా సయ్యంది పాదం సెమి ఫైనల్ డ్యాన్స్ పోటీలు

జూలై 1 నుండి 3వ తేదీ వరకు వాషింగ్టన్ D.Cలో జరగనున్న 17వ ATA కన్వెన్షన్‌ మరియు యూత్ కాన్ఫరెన్స్ లో భాగంగా ATA కన్వెన్షన్ బృందం జూన్ 12, 2022 న వర్జీనియా లోని హిల్టన్ వాషింగ్టన్ దుల్స్ ఎయిర్పోర్ట్ ఆడిటోరియంలో ATA సయ్యంది పాదం నృత్య పోటీలను విజయవంతంగా నిర్వహించింది. కూచిపూడి, భరత నాట్యం, జానపదం మరియు ఫిల్మ్ విభాగాలలో చాలా నాణ్యమైన ప్రదర్శనలతో ఈ పోటీలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి.

ఈ పోటీలను తిలకించేందుకు 200 మందికి పైగా ప్రయక్షకులు హాజరయ్యారు. జడ్జీలు శ్రీమతి  సాయి కాంత రాపర్ల, శ్రీ హలీం ఖాన్ మరియు  శ్రీమతి సుష్మ అమృతలూరీ ఈ పోటీలకు న్యాయనిర్ణేతగా నిలిచారు.

ఈ కార్యక్రమానికి ATA సయ్యంది పాదం చైర్ సుధా కొండపు, కో-చైర్ భాను మాగులూరి, ప్రాంతీయ సలహాదారు రామకృష్ణ రెడ్డి అలా, రీజినల్ కోఆర్డినేటర్లు శ్రవణ్ పదురు అలాగే డీసీ ప్రోగ్రాం కాంట్రిబ్యూటర్స్ చంద్ర, రాజ్, నవ్య సమీరా , స్వర్ణ , శ్రీలక్ష్మి మరియు గీత   అధ్యక్షత వహించారు. ATA బృందం ప్రతి విభాగంలో విజేతలకు సర్టిఫికెట్లు మరియు మొమెంటోలను అందించింది. ఈ పోటీల్లో గెలిచిన రాష్ట్ర స్థాయి విజేతలు, DC జరగనున్న కన్వెన్షన్‌లో ఫైనల్స్‌లో పోటీపడతారు. ఫైనల్స్‌కు శేఖర్‌ మాస్టర్‌ న్యాయనిర్ణేతగా వ్యవహరించడం విశేషం.

వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియా  విజేతల వివరాలు

సీనియర్ క్లాసికల్ సోలో - వైష్ణవి ఉప్పలపాటి ,రన్నరప్ గా లలిత బులుసు
సీనియర్ క్లాసికల్ గ్రూప్ - సాధన తిలక్, వైష్ణవి ఉప్పలపాటి, రన్నరప్ గా శ్రీవత్స పుసులూరి, ఆశ్రీజా సాధినేని
జూనియర్ క్లాసికల్ సోలో - సాధన తిలక్, రన్నరప్ గా శ్రీవత్స పుసులూరి
జూనియర్ క్లాసికల్ గ్రూప్ - ధ్రువ శ్రీ రాయ్, శాన్వి భూమన రన్నరప్ గా మిత్ర సాయినాథుని, సహస్ర వింజమూరి
సీనియర్ నాన్ క్లాసికల్ సోలో - సుజన్ కోరుమిల్లి, రన్నరప్ గా నవ్య ఆలపాటి
సీనియర్ నాన్ క్లాసికల్ గ్రూప్ - నళిని, ప్రత్యూష, భువిజ 
జూనియర్ నాన్ క్లాసికల్ సోలో - విజేత అంవిత గున్న, రన్నరప్ గా దుర్గ సంజయ్ ఘంటా
జూనియర్ నాన్ క్లాసికల్ గ్రూప్ - విజేతలు ధృతి అతికం, మిత్ర సాయినాథుని, సహస్ర వింజమూరి, ఐశ్వర్య మత్త, రన్నరప్ గా ఆధ్య మామిడిపల్లి, దుర్గ ఆధ్య చిల్లరిగా, అనఘా బొడ్డుపల్లి, అన్విక పోలోజు.

అధ్యక్షుడు భువనేష్ బూజాల మాట్లాడుతూ ATA అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఎప్పటికి  కూడా మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ ముందు తరాలవారికి అందిస్తూవుంటుంది, అందులో భాగంగా గత రేడు నెలలుగా జరిగే ఆటా సయ్యంది పాదం ఈరోజు వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియా లో సెమి ఫైనల్ డాన్స్ పోటీలు విజయవంతంగా పూర్తిచేసుకుంది మరియు ఫైనల్స్ వాషింగ్టన్ డీసీ జులై 2 న కన్వెన్షన్ లో ఉంటుంది అని అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతగా పూర్తి చేసినందుకు సయ్యంది పాదం చైర్ సుధ కొండపు,  కో-చైర్ భాను మాగులూరి, సలహాదారు రామకృష్ణ అల మరియు న్యాయనిర్ణేతలకు ధన్యవాదాలు, అలాగే అందరిని మీ కుటుంబ సభ్యులతో జులై లో 1-3 వరకు జరిగే అట కన్వెన్షన్ కు ఆహ్వానించారు.

కాన్ఫరెన్స్ కన్వీనర్ సుధీర్ భండారు, కో-కోఆర్డినేటర్ రవి చల్ల, మీడియా చైర్ రాము ముండ్రాతి, బ్యాక్ స్టేజి కోఆర్డినేషన్ చైర్ అమర్ అతికం మరియు రిజిస్ట్రేషన్ చైర్ అనిల్ నందికొండ విజేతలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు మరియు బహుమతులు అందచేశారు.

సయ్యంది పాదం చైర్ సుధ కొండపు, కో-చైర్ భాను మాగులూరి వాషింగ్టన్ డీసీ మెట్రో ఏరియా ATA కోఆర్డినేటర్లు ATA నాయకత్వానికి, న్యాయనిర్ణేతలకు, పాల్గొనేవారికి మరియు ప్రేక్షకులకు ఈ ఈవెంట్‌ను గ్రాండ్‌గా విజయవంతం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

కాన్ఫరెన్స్ వివరాలు...

అమెరికా తెలుగు సంఘం(ఆటా) 17వ మహాసభలు అందరి తెలుగు వారి పండుగ కావున అమెరికా రాజధాని నగరం నడిబొడ్డున వాషింగ్టన్ డి సి లో మూడు రోజుల పాటు మహాసభలకు 15,000 పైగా హాజరయ్యే విధంగా న భూతో న భవిష్యతి లాగా నిర్వహించటానికి  పద్మవిభూషణ్ సద్గురు, పద్మవిభూషణ్ మ్యూజిక్  మాస్ట్రో ఇళయరాజా, కమలేష్ D.పటేల్, డిజె టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ,  రకుల్ ప్రీత్ సింగ్, శ్రీలీల, సంగీత దర్శకుడు తమన్, రామ్ మిర్యాల, మంగ్లీ, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్, GMR, ఉపాసన కొణిదెల, ప్రముఖ కవులు, కళాకారులు, సినీ ప్రముఖులు, మరియు తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది రాజకీయ నాయకులు విచ్చేస్తున్న ఈ మహాసభలకు అమెరికా లో వున్న తెలుగువారందరూ హాజరై భారీ స్థాయిలో విజయవంతం చేసుకుందాము.

Tickets: https://www.ataconference.org/buy-tickets

 

Click here for Event Gallery

 

 

Tags :