ASBL Koncept Ambience

బాన్స్‌వాడలో ఆటా సేవలు... వాటర్‌ప్లాంట్‌ బహుకరణ

బాన్స్‌వాడలో ఆటా సేవలు... వాటర్‌ప్లాంట్‌ బహుకరణ

అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) చేస్తున్న సేవలు అనిర్వచనీయమని మాజీ స్పీకర్‌, బాన్సువాడ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలో ప్రభుత్వ మాత శిశు సంరక్షణ దవఖానలో అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (ఆటా) సహకారంతో, ఆటా కోశాధికారి సతీష్‌ రెడ్డి, రఘుపతి రెడ్డి ల ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన గంటకు 1000 లీటర్ల మంచి నీటిని ఉత్పత్తి చేసే ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్‌, ఈసీజీ యూనిట్‌ ను బాన్సువాడ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ  సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆటా వేడుకల చైర్‌, ఎలెక్ట్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ చల్లా, రామకృష్ణారెడ్డి అల ఇతర ప్రతినిధులు హాజరవ్వగా, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ... ప్రజోపయోగ కార్యకలాపాలకు సంబంధించిన కార్యక్రమాలకు నిధులు అందించడం గొప్ప విషయం అన్నారు. నిత్యం నిరుపేద ప్రజలు వచ్చిపోయే బాన్సువాడ దావఖానాకు ఈసిజి, ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్‌ అందించిన ఆటా కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పేద ప్రజలకు ఉపయోగపడే వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసి ఆటా బాన్సువాడ ప్రజల మనసుల్లో చిర స్థాయిగా నిలిచిపోతుంది అన్నారు. మరిన్ని సేవలు అందించి ‘‘ఆటా’’ మరింతగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

ఆటా వేడుకల చైర్‌, ఎలెక్ట్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ చల్లా మాట్లాడుతూ... గత 31 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇదే సందర్భంలో ఇక్కడ కూడా రఘునాథ్‌ రెడ్డి, ఆటా కోశాధికారి సతీష్‌ రెడ్డి ల ఆర్థిక సహకారంతో ఆర్‌ఓ వాటర్‌ ప్లాంట్‌, ఈసీజీ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. వీటిని ప్రజలు అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. దాతలను ఈ సందర్భంగా అభినందించారు. 

ఈ కార్యక్రమంలో బాన్సువాడ దవాఖాన సూపరింటెండెంట్‌, ‘‘ఆటా’’ వేడుకల కో చైర్‌ వేణు సంకినేని, సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, కోశాధికారి సతీష్‌ రెడ్డి, 18వ ఆటా కాన్ఫరెన్స్‌ నేషనల్‌ కో ఆర్డినేటర్‌ సాయి సుధిని, జాయింట్‌ ట్రెజరర్‌ రవీందర్‌ గూడూరు, ఆటా బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌ నరసింహారెడ్డి ద్యాసాని, భాను స్వర్గం, కాశీ కొత్త, నర్సిరెడ్డి గడ్డి కొప్పుల, కార్పొరేట్‌ చైర్‌ హరీశ్‌ బత్తిని, దవాఖాన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Click here for Photogallery

 

 

 

Tags :