మహబూబ్ నగర్ జిల్లాలో ఆటా సేవ కార్యక్రమాలు
కోట కదిర స్కూల్ కి జిరాక్స్ మిషన్, పిల్లలకి బ్యాగుల పంపిణీ
మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్ రూరల్ మండలం, కోట కదిర ప్రాథమిక పాఠశాలలో అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో స్కూల్ కి జిరాక్స్ మిషన్, పిల్లలకు బ్యాగులు అందచేశారు. ఈనెల 10 నుండి 30 వరకు జరిగే ఆట సేవ కార్యక్రమాల్లో భాగంగా కోట కదిర గ్రామానికి చెందిన అమెరికాలో స్థిరపడ్డ ఆటా సెక్రెటరీ రామకృష్ణ రెడ్డి అల సహకారంతో పిల్లలకు 50 వేల రూపాయలు విలువచేసే బ్యాగులను విద్యార్థులకు పంపిణీ చేశారు. అలాగే స్కూల్ ఉపాధ్యాయుల కోరిక మేరకు జిరాక్స్ మిషన్ అందించారు.
ఈ సందర్భంగా ఆటా సెక్రెటరీ రామకృష్ణ రెడ్డి అల మాట్లాడుతూ... ఎంత ఎదిగినా... ఎదగడానికి కారణమైన ఊరిని మరచిపోకూడదు అన్నారు. నన్ను ఇంత వాడిని చేసిన ఈ గ్రామానికి నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తాను అన్నారు. ఇక్కడి విద్యార్ధులు ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. ఇదే సందర్భంలో హెడ్మాస్టర్ హరినాథ్ మాట్లాడుతూ.... మనిషి ఎంత గొప్పగా ఎదిగిన తాను పుట్టిన గ్రామాన్ని మర్చిపోకుండా స్కూలు విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేయడం సంతోషదాయకమన్నారు, ఆలాగే విద్యార్థులను ప్రోత్సహిస్తూ వారి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు అధిరోహిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకొని జీవితంలో గొప్పగా రాణించాలని కోరారు. బ్యాగులు పంపిణీ చేసిన అమెరికా తెలుగు సంఘానికి, కోటకద్ర నివాసి రామకృష్ణారెడ్డి అల గారికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ రమ్య దేవేందర్ రెడ్డి, ఎస్ఎంఎస్ చైర్మన్ మహమ్మద్ కాజా, పాఠశాల ఉపాధ్యాయులు వి సురేఖ, మహమూద్ భాష, మంజుల, అనిత, రాజశేఖర్ గౌడ్, విద్యార్థి విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.