హనుమకొండలో ఆటా వాగ్గేయకార సంగీతోత్సవం డిసెంబర్ 13న
ఆటా వేడుకలు కార్యక్రమంలో భాగంగా హనుమకొండలో వాగ్గేయకార సంగీతోత్సవంను ఏర్పాటు చేశారు. అన్నమయ్య, రామదాసు, త్యాగరాజును స్మరించుకుంటూ ఆర్ట్ పేరుతో ఈ కార్యక్రమాన్ని ఆటా నిర్వహిస్తోంది. డిసెంబర్ 13వ తేదీన హనుమకొండలోని అంబేద్కర్ భవన్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరగనున్నది. ఆధ్యాత్మిక, భక్తిభావంతో అందరినీ పరవశింపజేసేలా ఈ కార్యక్రమాన్ని ఆటా నిర్వహిస్తోంది. నిహల్ కొండూరి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయగా, లయక్ అహ్మద్, మహమ్మద్ సహకరించారు. ఈ కార్యక్రమంలో కె. ప్రణతి, వినయ్, కార్తికేయ, శృతిక, నీలేష్, లాస్యప్రియ, ఎం. అభిఙ, వి. నికిత, ఎండి షాబాజ్, హర్షిత్, వి. ప్రణవి పాటలు పాడనున్నారు. కృష్ణవేణి మల్లావజ్జల కూడా పాల్గొంటున్నారు. తిరుపతిలోని కళ్యాణ్, వారి బృందం మ్యూజికల్, ఆర్కెస్ట్రా అందిస్తోంది.
Tags :