ASBL Koncept Ambience

సీనియర్ ల కోసం "ఆటా" ప్రత్యేక కార్యక్రమాలు

సీనియర్ ల కోసం "ఆటా" ప్రత్యేక కార్యక్రమాలు

చికాగోలో జూలై 1 నుంచి 3వ తేదీ వరకు జరిగే ఆటా కాన్ఫరెన్స్‌లో తెలుగు సీనియర్స్‌ కమిటీ ఆధ్వర్యంలో సీనియర్ల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. సీనియర్ల అనుభవాలు, తెలుగు సంస్కృతిపై వారికి ఉన్న అవగాహన, వారి కాలంలో ఉన్న పరిస్థితులు వంటి అంశాలు తెలుసుకోవడానికి చాలామంది ఆసక్తిగా ఉంటారు. సీనియర్స్‌ కోసం ప్రత్యేకంగా ఆరోగ్య సదస్సును నిర్వహించడంతోపాటు వారికి వివిధ రకాల వ్యాధులపై అవగాహన కల్పించేలా వైద్యులచేత ప్రసంగాలను ఇప్పిస్తున్నారు. సమాజంలో వారికి ఎదురవుతున్న ఇబ్బందులు, హెల్త్‌, ప్రస్తుతం, భవిష్యత్తులో వారికి అందించాల్సిన చేయూత వంటి విషయాలపై ప్యానల్‌ డిస్కషన్స్‌లో చర్చించనున్నారు. తేనెలొలుకు తెలుగు హాస్య కదంబం, పద్యాలు, పాటలు, ఛలోక్తులు వంటి విషయాలపై స్టేజిపై ప్రదర్శన వంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 

 

Tags :