ASBL Koncept Ambience

ఆటా 17వ మహాసభలలో వీడియో మరియు లఘు చిత్రాల పోటీలు

ఆటా 17వ మహాసభలలో వీడియో మరియు లఘు చిత్రాల పోటీలు

అమెరికా తెలుగు సంఘం (ఆటా) అధ్యక్షులు భువనేష్‌ బుజాల, కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ సుధీర్‌ బండారు మరియు అన్ని కమిటీల సభ్యులు అత్యంత ప్రతిష్టాత్మకంగా అమెరికా రాజధాని నగరం నడిబొడ్దున వాషింగ్టన్‌ డిసి లో మూడు రోజులపాటు జూలై 1 నుండి 3 వరకు వాల్టర్‌ ఇ వాషింగ్టన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా..నభూతో నభవిష్యతీ అనేలా ఆటా 17వ మహాసభలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఈ మహాసభలకు 10,000 మందికిపైగా హాజరయ్యె విధంగా సన్నాహాలు జరుగుతున్నాయి.  ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పద్మవిభూషణ్‌ జగ్గీ వాసుదేవ్‌ (సద్గురు), ప్రముఖ కవులు, కళాకారులు,రాజకీయ ప్రముఖులు,సినీ ప్రముఖులు విజయ్‌ దేవరకొండ , నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ తో గోల్ఫ్‌ టోర్నమెంట్‌, గాయకుడు రాం మిరియాల మరియు ప్రముఖ సంగీత దర్శకుడు పద్మవిభూషణ్‌ ఇళయరాజా సంగీత విభావరి ఈ మహాసభల్లో హైలైట్స్‌గా నిలవనున్నది.

ఆటా అధ్యక్షులు భువనేష్‌ బుజాల తెలుగు వారందరిని ప్రోత్సహించటం కోసం టిక్‌టాక్‌ వీడియో మరియు లఘు చిత్రాలలో ఆసక్తి వున్నవారు ఆన్‌ లైన్‌ లో పేరు నమోదు చేసుకుని పాల్గొనాలని కోరుతున్నారు. ఈ టిక్‌టాక్‌  వీడియో మరియు లఘు చిత్రాల కు న్యాయ నిర్ణేతలుగా ప్రముఖ దర్శక నిర్మాత ‘‘కమిలి’’ సినిమా జాతీయ అవార్డు గ్రహీత హరిచరణ ప్రసాద్‌, ప్రముఖ దర్శక నిర్మాత ‘‘మల్లేశం’’ సినిమా అవార్డు గ్రహీత రాజ్‌ రాచకొండ, ప్రముఖ సంగీత దర్శకుడు కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ నామిని కార్తీక్‌ కొడకండ్ల ఉన్నారు.

 

Tags :