డిసెంబర్ 5 నుంచి ఆటా వేడుకలు...కార్యక్రమాల వివరాలు
అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి ఆటా వేడుకలు డిసెంబర్ 5వ తారీకు నుంచి మూడు వారాల పాటు ఎంతో ఘనంగా నిర్వహించనున్నారు. డిసెంబర్ 26 తారీకున గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. ఆటా వేడుకలు సందర్భంగా ఆటా ప్రతినిధులు మాతృభూమి కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల మరియు ప్రెసిడెంట్ ఎలెక్ట్, ఆటా వేడుకలు చైర్ మధు బొమ్మినేని గారి ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న ఆటా వేడుకలు కార్యక్రమానికి కో-చైర్ గా అట్లాంటాకి చెందిన అనిల్ బొద్దిరెడ్డి మరో కో-చైర్ గా న్యూజెర్సీకి చెందిన శరత్ వేముల వ్యవహరిస్తున్నారు.
ఆటా వేడుకల్లో భాగంగా నిర్వహించే సేవా కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి. మహిళా సాధికారత కోసం వరంగల్ జిల్లాలో కుట్టు మెషిన్ లో ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతోంది. ట్రైనింగులో గ్రాడ్యుయేట్ అయినా వారికీ కుట్టు మెషిన్ లు ఇవ్వటం జరుగుతుంది. కాన్సర్ స్క్రీనింగ్ నల్గొండలో నిర్వహిస్తున్నారు. దాదాపు 200 మందికి పైగా మహిళలకు ఈ స్క్రీనింగ్ నిర్వహించబోతున్నారు. ఉభయ రాష్ట్రాలలో ఎన్నో హెల్త్ మరియు కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణి చేస్తారు. వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో స్కూల్లో మౌలిక సౌకర్యాలు అభివృద్ధిపరిచే దిశగా విద్యుదీకరణ, మంచినీటి సౌకర్యం, డిజిటిలైజేషన్ ప్రాజెక్ట్స్ చేపడుతారు. డిసెంబర్ 10వ తారీఖున అనాధ శరణాలయంలో అన్నదానం నిర్వహిస్తారు.
ఆటా అంతర్జాతీయ సాహితి సదస్సు డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని లక్డికపూల్‌లో ఉన్న బెస్ట్ వెస్టర్న్ అశోక లో నిర్వహించనున్నారు. తిరుపతి లో డిసెంబర్ 18 తారీఖున సాంస్కృతిక కళోత్సవం నిర్వహించనున్నారు. వాగ్గేయకారుల సంగీతోత్సవం హనుమకొండలో నిర్వహించనున్నారు. బిజినెస్ సెమినార్స్ విశాఖపట్నం మరియు హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. అమెరికన్ విశ్వవిద్యాలయాలలో దరఖాస్తు చేసుకోవటానికి పాటించవలసిన నియమాలు తెలియపరిచేందుకు అమెరికన్ కన్సులేట్ ప్రతినిధులు మరియు తెలంగాణ విద్యాశాఖ అధికారులతో కార్యక్రమం నిర్వహించబోతున్నారు.