ASBL Koncept Ambience

మాతృరాష్ట్రాల్లో ఆటా వేడుకలు డిసెంబర్‌ 11 నుంచి

మాతృరాష్ట్రాల్లో ఆటా వేడుకలు డిసెంబర్‌ 11 నుంచి

అమెరికా తెలుగు సంఘం (ఆటా) ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే ఆటా వేడుకలు ఈ సంవత్సరం డిసెంబర్‌ 11 నుంచి జరుగుతాయని ఆటా అధ్యక్షుడు పరమేష్‌ భీంరెడ్డి తెలిపారు. డిసెంబర్‌ 29న గ్రాండ్‌ ఫైనల్‌ హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరగనున్నది. ఈ వేడుకల సందర్భంగా ఉచిత వైద్యశిబిరాలు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, జాబ్‌మేళా, ఆటా అంతర్జాతీయ సాహితీ సదస్సు, ఆటా సాంస్కృతిక, జానపద ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలతోపాటు స్కూల్‌ ప్రాజెక్ట్‌, స్టూడెంట్‌ స్కాలర్‌షిప్స్‌, వైజాగ్‌లో, హైదరాబాద్‌లో బిజినెస్‌ కాన్ఫరెన్స్‌, ఎడ్యుకేషనల్‌ సెమినార్‌ వంటి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు సంబంధించి మరిన్ని వివరాలకోసం ఫ్లయర్‌ను చూడండి.

Tags :