ఘనంగా ముగిసిన ఆటా వేడుకలు
ప్రముఖులకు ఆటా ఎక్సలెన్స్ అవార్డులు...శోభారాజుకు జీవన సాఫల్య పురస్కారం
అమెరికా తెలుగు సంఘం తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ఆటా వేడుకలు,సేవా కార్యక్రమాలు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన గ్రాండ్ ఫైనల్ కార్యక్రమంతో ముగిశాయి. ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులను ఆటా సన్మానించింది. ప్రముఖ గాయని శ్రీమతి శోభారాజును జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది. సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్, కవి యాకూబ్, మానవతావాది సాయిపద్మ, సామాజిక సేవకుడు వేణుగోపాల్ రెడ్డి, వ్యాపారవేత్త మల్లారెడ్డి, ఇంజనీరింగ్ టెక్నాలజీ రంగంలో సుధీర్ రెడ్డి, సమాజ సేవకురాలను విశిష్ట పురస్కారాలతో సత్కరించింది. కేంద్ర పర్యాటక, సంస్కృతి, అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి, మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ రోడ్డు భవానాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, స్టేట్ కల్చరల్ కౌన్సిల్ చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, మాజీ మంత్రి చిన్నారెడ్డి, సినీ నటులు సుమన్, భానుచందర్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్య అతిధులుగా హాజరైయ్యి తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా నిర్వహించిన అనేక సాంస్కృతిక కార్యక్రమాలు అహుతులను అలరించాయి. కన్నుల పండువగా జరిగిన ఈ ఆటా వేడుకలు ఆటా సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అయిన ఈ వేడుకలను అమెరికాలో ఉన్న ఆటా సభ్యులు, అమెరికాలో ఉన్న తెలుగు వారందరు విక్షించారు.
అమెరికా తెలుగు సంఘం ప్రతి రెండు సంవత్సరాలకొకసారి నిర్వహించే ఆటా మహాసంబరాలు అమెరికాదేశంలో పెద్దఎత్తున ఆటా సంస్థ జరుపుతుంది. మాతృ భూమి నుండి వివిధ రంగాలకు సంబందించిన ఎంతో మంది దిగ్గజాలను అతిథులుగా ఆహ్వానిస్తుంది. కన్న తల్లి సేవ గొప్పది.. మాతృ భూమికి ఎంతో సేవా చేసిన ఋణం తీర్చు కోలేము అంటూ అందుకుగాను, ఆటా మహా సంబరాలను జరిపే ముందే డిసెంబర్ మాసంలో గత ఇరవై సంవత్సరాల నుండి రెండు సంవత్సరాలకు ఒక్కసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రామాలకు, పట్టణాలకు ఆటా సంస్థ కార్యవర్గం వచ్చి సేవా కార్యక్రమాలు స్థానికంగా చేస్తోంది. మంత్రులను, ఇక్కడి పాలకులను వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలవడం, సంస్థ చేసే సేవా కార్యక్రమాలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు అతిథులుగా స్వాగతించి, భాగస్వామ్యులను చేయడం సంస్థకు ఎంతో గర్వాన్ని, గౌరవాన్ని, సంతోషాన్ని కలుగచేస్తుంది.
అందులో భాగంగా ఈసారి మధు బొమ్మి నేని ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్, ఆటావేడుకలు మరియు ఆటా సేవ డేస్ చైర్ గా బాధ్యత తీసుకున్నారు. అధ్యక్షులు భువనేశ్ బూజల, ఆటా పాలకమండలి సభ్యులు, ఆటా వేడుకలు మరియు ఆటా సేవా డేస్ కో చైర్స్ శరత్ వేముల, అనిల్ బొద్దిరెడ్డి, మరికొందరు పాలకమండలి సభ్యులు, కార్యవర్గ బృందం తెలుగు రాష్ట్రాలకు వచ్చి ఎంతో బాధ్యతతో పనులు నిర్వహిస్తూ, పెద్దమొత్తంలో దాతలుగా పాటు తెలుగు రాష్ట్రాల్లో మరికొంత మంది దాతలతో ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలకు సహాయపడుతున్నారు. ముఖ్యఅతిధులు, అర్గనైజర్లు మరియు స్పాన్సర్లతో కలిసి 18 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 17 నగరాల్లో 21 సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సేవా కార్యక్రమంలో భాగంగా హేల్త్ క్యాంప్ లో భాగంగా క్యాన్సర్ స్క్రీనింగ్, దంతం, నేత్రం, ఆరోగ్య పరిక్షలు నిర్వహించారు. స్కూల్ ప్రోగ్రామ్ లో ఇన్‌ఫ్రాస్టక్చర్, ఫర్నిషింగ్, బుక్స్, క్రీడా వస్తువులు, స్కూల్ స్పోర్ట్స్ డ్రస్, వాటర్ ఫిల్టర్ సిస్టమ్, డిజిటల్ క్లాస్ రూమ్ ఏర్పాటు చేశారు. వచ్చే సంవత్సరం జులై 1, 2022 నుండి జులై 3, 2022 వరకు అమెరికా రాజధాని అయినా వాషింగ్టన్ డిసి వాల్టర్ ఇ కన్వేషన్ సెంటర్ లో అధ్యక్షులు భువనేశ్ బూజల సారథ్యములో పాలకమండలి మరియు కార్యవర్గ బృందం అంతా కలిసి నిర్వహించే 17వ ఆటా మహాసభలు మరియు యువ సమ్మేళనం జరిపే ముందు మాతృదేశములో ఆటా సేవ డేస్ కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేశారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి....
అమెరికా వంటి దేశాలలో మన తెలుగు వారు చాలా కీలకపాత్ర పోషిస్తున్నారు. అమెరికాలో తెలుగువారు లేని రాష్ట్రం లేదంటే అతిశయోక్తి లేదు. యూఎస్‌ఎలో ప్రతి రాష్ట్రంలో తెలుగు వారు బహురంగాల్లో సేవలందిస్తూ దేశ ఆర్థికాభివృద్ధి ప్రధాన భూమిక పోషిస్తున్నారని ప్రశంసించారు. క్రమంగా అక్కడ తెలుగు వారు జనాభా పెరుగుతూ మనవారిని విస్మరించేలేని పరిస్థితి నెలకొన్నదని, కొంతమంది గ్రీన్‌కార్డులు పొందిన ఓటర్ల జాబితాల్లో పేర్లు నమోదు చేసుకుని స్థానిక సంస్థల నుంచి చట్ట సభలకు ఎన్నికవుతున్నారని వివరించారు. అమెరికాకు భారతసంతతికి చెందినవారు ఉపాధ్యక్షురాలు కావడం అంటే మన దేశం ప్రజల ప్రాముఖ్యత ఏమిటో అర్థమవుతుంది. మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మాతృ దేశానికి సేవలు చేస్తున్నారు. ఆటా సంస్థ సేవా కార్యక్రమాలు అభినందనీయం ఆయన తెలిపారు. ఎక్కడ ఎంత ఏం సంపాదించినా చివరకు మిగిలేది చేసే సేవా కార్యక్రమాలు మాత్రమే. ప్రజలకు సేవ చేయాల్సిన కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేయాలి. ఆటా చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయం. తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికా వెళ్లిన వారు తమ మాతృభూమిని విస్మరిచవద్దని, అనేకమంది తాము పుట్టిన గ్రామాలను అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. అద్భుతమైన వ్యాక్సిన్ మనం కనుగొనగలము... పేద దేశాలకు వ్యాక్సిన్ ఉచితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. రానున్న రోజుల్లో సరికొత్త సాంకేతికతో పాటు రాష్ట్రాలను దేశాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఏ లక్ష్యసాధన కోసం తెలంగాణ సాధించుకుందాం అందుకోసం అందరూ కృషి చేయాలి అని కిషన్ రెడ్డి తన ప్రసంగంలో పేర్కొన్నారు.
ఎంపీ రేవంత్ రెడ్డి...
ప్రపంచంలో పది మంది ఐటీ నిపుణులతో అందులో ఐదు మంది భారతీయులే ఉంటారు. ఆ ఐదుగురిలో ఒక తెలుగువారు ఉంటారు. ఐటీ నిపుణులు అత్యధికులు తెలుగువారే ఉండడం గర్వకారణం. అమెరికా ఆర్థిక వ్యవస్థ లో మన తెలుగువారి పాత్ర విడదీయలేనిది. అమెరికా అభివృద్ధిలో మన పాత్ర అత్యంత కీలకమైనది. అమెరికా వంటి దేశంలో రాజకీయాలలో కూడా తెలుగు వారి ప్రాముఖ్యతను పెంచాలని అంటూ, ఈ దిశగా అమెరికాలోని తెలుగువాళ్ళు, తెలుగు సంఘాలు కృషి చేయాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎంపి రేవంత్ రెడ్డి అన్నారు. అమెరికాలో మన తెలుగు కమ్యూనిటికీ అటా చేస్తున్న సేవలు అభినందనీయం అంటూ, అమెరికాలో ఉన్నా తెలుగు రాష్ట్రాలలో తమ సొంతఊర్ల అభివృద్ధికి పాటుపడటం సంతోషం అని అంటూ, ఆటాను ఆయన అభినందించారు.
రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి....
తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ అభివృద్ధిలో ఎన్నారైల పాత్ర ఎంతో అభినందనీయమన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత విద్యుత్తులో అభివృద్ధి సాధించాం, వివిధ రంగాలలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందని చెప్పారు. ఆటా నాయకులు తెలంగాణ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు.
ఆటా సంస్థ డిసెంబర్ 5 నుండి 25 వరకు నిర్వహించిన సేవా కార్యక్రమాలు
డిసెంబర్ 6న వనపర్తిలో వెటర్నరీ వైద్యశాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
డిసెంబరు 7న నల్గొండ లో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.
డిసెంబరు 8 మరియాల్, భువనగిరిలో ఆరోగ్య మరియు నేత్రశిబిరం కార్యక్రమం నిర్వహించారు.
డిసెంబరు 10న హైదరాబాద్ లో అనాథ ఆశమ్రంను సందర్శించి, అన్నదానం కార్యక్రమం ఆటా సభ్యులు పాల్గోన్నారు.
డిసెంబరు 11న హైదరాబాద్ లో తెలుగు సాహితీ వేత్తలతో సాహిత్య సదస్సు నిర్వహించారు.
డిసెంబరు 13న వరంగల్ లో స్కూ ల్ ప్రాజెక్ట్ మరియు హనుమకొండలో వాగ్గేయకారుల సంగీతోత్సవం కార్యక్రమం నిర్వహించారు.
డిసెంబరు 14న గుడిపాడు, వరంగల్ లో ఆర్వో వాటర్ ప్లాంట్ మరియు ఆరోగ్య శిభిరం నిర్వహించారు.
డిసెంబర్ 15న కడ్తాయి, రంగారెడ్డి జిల్లా, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ లో స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆరోగ్య శిభిరం ఏర్పాటు చేశారు.
డిసెంబర్ 16న వేలుపల్లి, దత్తాయిపల్లి, యాదాద్రిలో స్కూల్ రేనోవేషన్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేశారు.
డిసెంబర్ 18న, హైదరాబాద్ అబిడ్స్ లో ఆటా ఎడ్యుకేషన్ సెమినార్ నిర్వహించారు.
డిసెంబర్ 21న, రాజంపేట్లో ఆరు గ్రామాల్లో 250 మంది కుటుంబాలకు చీరలు, దోతిలు, దుపట్లు పంపిణి చేశారు.
ఏలూరులో ఆటా సాంస్కృతిక వేడుకలు నిర్వహించారు. ఇందులో ఆటానాధం ద్వారా గెలుపోందిన గాయకులతో ప్రత్యేక గానకచేరి నిర్వహించారు.
డిసెంబరు 23న చిట్యాల, నల్గొండలో కాన్సర్ స్క్రీనింగ్, హైదరాబాద్ లో బిజినెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
డిసెంబర్ 23న జాలు కాలువ, నల్గొండలో అంగన్వాడీ బిల్డింగ్ ప్రారంభోత్సవం, మహబూబాబాద్ జిల్లా పరిషత్ హై స్కూల్ లో కంప్యూటర్ ల్యాబ్ డొనేషన్ కార్యక్రమం.
డిసెంబరు 24న సరస్వతి విద్యా మందిర్ లో విద్యార్థులకు పుస్తకాల పంపిణి, తాగునిటి సదుపాయలు, కంప్యూటర్ సిస్టమ్ లు అందజేశారు.
ఆటా సేవా డేస్ విజయవంతానికి కృషి చేసిన నాయకులు
భువనేశ్ బూజల, ఆటా అధ్యక్షులు
మధు బొమ్మినేని, ఆటా ప్రెసిడెంట్ ఎలెక్ట్, ఆటావేడుకలు మరియు ఆటా సేవా డేస్ చైర్
అనిల్ బొద్దిరెడ్డి, ఆటా సేవా డేస్ కో చైర్స్,
శరత్ వేముల, ఆటా సేవా డేస్ కో చైర్స్ ,
ఆటా పాలకమండలి సభ్యులు