ASBL Koncept Ambience

సూర్యాపేటలో 'ఆటా' వేడుకలు-స్కిల్‌ డెవలప్‌మెంట్‌, జాబ్‌ మేళా

సూర్యాపేటలో 'ఆటా' వేడుకలు-స్కిల్‌ డెవలప్‌మెంట్‌, జాబ్‌ మేళా

అమెరికా తెలుగు సంఘం (ఆటా) మాతృరాష్ట్రాల్లో నిర్వహిస్తున్న ఆటా ఇండియా వేడుకల్లో భాగంగా డిసెంబర్‌ 13వ తేదీన సూర్యాపేట జిల్లాలో స్కిల్‌ డెవలప్మెంట్‌, జాబ్‌ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆటా ఎలెక్ట్‌ ప్రెసిడెంట్‌ భువనేశ్‌ బుజాలా, ఆటా బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీ అనిల్‌ బోదిరెడ్డి, రామకష్ణా రెడ్డి అలా, ఆటా 2020 కన్వెన్షన్‌ కన్వీనర్‌ నర్సింహా రెడ్డి ద్యాసాని, కిషోర్‌ గూడూరు పలువురు ఆటా ప్రతినిధులు హాజరయారు. మోతి మండల ఎంపీపీ ఉషా, ఎండీవో, జెడ్పిటీసీ, సర్పంచ్‌ ఉప సర్పంచులు ఈ వేడుకల్లో పాల్గొని ఆటా చేస్తున్న సేవలను ప్రశంసించారు.

ఆటా ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ భువనేష్‌ బుజాలా మాట్లాడుతూ, మాతృరాష్ట్రంలోని నిరుద్యోగులకు మంచి శిక్షణ ఇప్పించి వారికి మంచి ఉద్యోగాలు లభించేలా చూడాలన్న ఉద్దేశ్యంతో ఈ ఆటా వేడుకల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ ఇప్పించాలని భావించాము. అందుకు అనుగుణంగా సూర్యాపేట జిల్లాలో మొదట ప్రారంభిస్తున్నాము ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

శ్రీనివాస్‌ రణబోతు ఆధ్వర్యంలో మోతి మండలం, మామిల్లాగూడెంలోని సుమంగళి ఫంక్షన్‌ హాల్‌ లో ఏర్పాటు చేసిన స్కిల్‌్‌ డెవలప్మెంట్‌, జాబ్‌ మేళాకు పెద్దఎత్తున యువతీయువకులు హాజరయ్యారు. టాటా స్ట్రైవ్‌ స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ సెంటర్‌ హైదరాబాద్‌ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మేళాలో బిజినెస్‌ డెవలప్‌ మెంట్‌, బిపివో సిసిఇ, ఆటోమొబైల్స్‌ సేల్స్‌ ఎగ్జిక్యుటివ్స్‌, హాస్పిటాలీటీ ఫుడ్‌ అండ్‌ బెవరెజ్‌ స్టెవర్డ్‌, రిటైల్‌ సెల్స్‌ అసోసియేట్‌, అసిస్టెంట్‌ ఎలక్ట్రీషియన్‌, క్వీక్‌ సర్వీస్‌ రెస్టారెంట్‌ లాంటి అంశాలపై స్కిల్‌ డెవలప్మెంట్‌ శిక్షణ నిర్వహించారు. ఇందులో దాదాపుగా 120 పైగా యువకులను సెలక్ట్‌ చేసి వారికి నాలుగు నుండి 12 వారాల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగాలు ఇవ్వనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మొదలైయిన ఈ జాబ్‌ మేళా సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది.

Click here for Photogallery

 

Tags :