ASBL Koncept Ambience

ఆటా కాన్ఫరెన్స్‌లో వివాహ పరిచయ వేదిక

ఆటా కాన్ఫరెన్స్‌లో వివాహ పరిచయ వేదిక

వాషింగ్టన్‌ డీసిలో జరగనున్న ఆటా మహాసభల్లో తెలుగు యువతీ యువకులకోసం ప్రత్యేకంగా వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా పెళ్ళి కావాల్సిన అమ్మాయిలు, అబ్బాయిలు తమ పేర్లను రిజిష్టర్‌ చేసుకుంటే వారిని ఈ మేట్రిమోనియల్‌ వేదికపై తీసుకెళ్ళి వివాహ సంబంధాలు నిశ్చయం చేసుకునేందుకు అవకాశాన్ని కలగజేయనున్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుకున్నారు. 

అనిత ముతోజు దీనికి చైర్‌గా వ్యవహరిస్తున్నారు. సాయి వల్లూరిపల్లి, సుదర్శన్‌ రెడ్డి అరువ, కోటిరెడ్డి దీనికి కో చైర్‌లుగా ఉన్నారు. 

 

Tags :