ASBL Koncept Ambience

తిరుపతిలో ఆటా వాక్ థాన్ 

తిరుపతిలో ఆటా వాక్ థాన్ 

ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రతి రోజు గంట పాటు నడకను నిత్య వ్యాయామంగా అలవాటు చేసుకోవాలని ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం విద్యార్థులకు సూచించారు. అమెరికా తెలుగు అసోసియేషన్(ఆటా) ఆధ్వర్యంలో ఉదయం ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలో తారకరామా స్టేడియం నుండి మహతి ఆడిటోరియం వరకు జరిగిన వాక్ థాన్ 2023  కార్యక్రమానికి ఎమ్మెల్సీ డా. సిపాయి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథి గా హాజరై జెండా ఊపి వాక్ థాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...యువత వ్యాయామాన్ని ప్రతి రోజు తమ నిత్య అలవాటు గా మార్చుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండగలమని ఎమ్మెల్సీ డా. సుబ్రహ్మణ్యం అన్నారు. అలాగే యువత ఆరోగ్య పరిరక్షణ పట్ల  ప్రత్యేక దృష్టి సారించి యోగ, మెడిటేషన్ వంటి కార్యక్రమాలను అలవర్చుకోవాలని సూచించారు. సోషల్ మీడియా ద్వారా ఆరోగ్య పరిరక్షణ సూత్రాలను సమాజానికి అందించి మంచి సాధనంగా వినియోగించాలని ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం సూచించారు. 

ఆటా ఎలెక్ట్ ప్రెసిడెంట్, ఆటా వేడుకల చైర్ జయంత్ చల్లా మాట్లాడుతూ... ఆటా చేపడుతున్నటువంటి సమాజ సేవా కార్యక్రమాలను గురించి వివరించారు.

ఈ కార్యక్రమంలో ఆటా ట్రెజరర్ సతీష్ రెడ్డి, పాస్ట్ ప్రెసిడెంట్ పరమేష్ భీమ్ రెడ్డి, ట్రస్టీ కాశీ కొత్త, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, అనిల్ కుమార్ బోయినపల్లి, ఎస్వీ యూనివర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

Click here for Photogallery

 

 

Tags :