హాయిహాయిగా....సాగిన అట్లాంటా తానా పిక్నిక్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అట్లాంటా జట్టు ఆధ్వర్యంలో ఆగష్టు 31 నుంచి సెప్టెంబర్ 2 వరకు హెలెన్ లోని యూనికాయ్ స్టేట్ పార్క్ లో పిక్నిక్ నిర్వహించారు. దాదాపు 200 మంది పాల్గొన్న ఈ విహారయాత్రలో పిల్లలకు పెద్దల కోసం అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆగష్టు 31న ఉదయం 11.30 గంటలకల్లా అందరూ హెలెన్ చేరుకొని మాటామంతితో విహారయాత్ర మొదలుపెట్టారు. సెప్టెంబర్ 1న నిర్వహించిన వాటర్ స్పోర్ట్స్, జిప్ లైనింగ్, కాయకింగ్, స్కావెంజర్ హంట్, ఆర్చరీ, ర్ట్యూబింగ్, ఎయిర్ గన్, పాడిల్ బోర్డింగ్, వాటర్ బెలూన్స్, ఫ్లై ఫిషింగ్, షటిల్, శాక్ రేస్ తదితర కార్యకలాపాలలో చిన్నలు పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంక్రాతి రెస్టారెంట్ వాళ్ళు లైవ్ కుకింగ్, గ్రిల్లింగ్ వంటకాలతో బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ మూడు రోజులకి సర్వ్ చెయ్యడం విశేషం.
వేసవి విడుపుగా ఇంత చక్కని పిక్నిక్‌ను తానా తరపున నిర్వహించిన అట్లాంటా సభ్యులు భరత్ మద్దినేని, వినయ్ మద్దినేని, శ్రీనివాస్ నిమ్మగడ్డ, అంజయ్య చౌదరి లావు, శ్రీనివాస్ లావు, భరత్ అవిరినేని, అనిల్ యలమంచిలి, మురళి బొడ్డు, గిరి సూర్యదేవర, సాయిరాం సూరపనేని, ఉపేంద్ర నర్రా, రాజేష్ జంపాల, సురేష్ యాదగిరి, సుధా వాణి సూరపనేని శ్రీధర్ పాలడుగు, తదితరులను అందరూ అభినందించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తానా ప్రెసిడెంట్ జే తాళ్లూరి, మల్లికార్జున వేమన కి తానా అట్లాంటా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సెప్టెంబర్ 2న వినాయక చవితి పూజ కార్యక్రమం ముగించుకొని అందరు హాయిగా ఉత్సాహంగా తిరిగి ఇంటిముఖం పట్టారు.