ASBL Koncept Ambience

తెలంగాణలో రూ. 3350 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఆరమ్‌ ఈక్విటీ

తెలంగాణలో రూ. 3350 కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఆరమ్‌ ఈక్విటీ

హైదరాబాద్‌లో ఏఐ ఆధారిత గ్రీన్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు

ప్రఖ్యాత ఆరమ్‌ ఈక్విటీ పార్టనర్స్‌ తెలంగాణలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్‌ లో 400 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.3350 కోట్లు) పెట్టుబడులకు సిద్ధపడిరది. హైదరాబాద్‌లో నెక్స్ట్‌-జనరేషన్‌, అర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌- పవర్డ్‌ గ్రీన్‌ డేటా సెంటర్‌ నిర్మించనున్నట్లు ప్రకటించింది. దశలవారీగా ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు ఈ సంస్థ తెలిపింది. అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రి శ్రీధర్‌ బాబుతో ఆరమ్‌ ఈక్విటీ సీఈవో, ఛైర్మన్‌ వెంకట్‌ బుస్సా సమావేశమయ్యారు. అనంతరం తెలంగాణలో తమ విస్తరణ ప్రణాళికలతో పాటు భారీ పెట్టుబడులను కంపెనీ ప్రకటించింది. గత ఏడాది ఆరమ్‌ ఈక్విటీ పార్టనర్స్‌ దాదాపు రూ.400 కోట్ల పెట్టుబడులకు తమ వార్షిక ప్రణాళికను ప్రకటించింది. ఇప్పుడు తమ ప్రణాళికలను భారీగా విస్తరించింది. 100 మెగావాట్ల అత్యాధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ ను స్థాపించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి దాదాపు రూ.3350 కోట్ల పెట్టుబడులకు సిద్ధపడింది.

 

 

Tags :