నాట్స్ సంబరాలు - సేవా ప్రముఖులకు అవార్డులు
ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) 7వ అమెరికా తెలుగు సంబరాల తొలిరోజు బాంక్వెట్ విందుతో ఘనంగా ప్రారంభమైన బాంక్వెట్ విందు సమావేశాల్లో వివిధ రంగాలలో సేవలందించిన వారికి అవార్డులను ప్రదానం చేశారు. ఉమెన్ ఎంపవర్‌మెంట్ విభాగంలో డా. శైలజ ముసునూరికి, ఔట్ స్టాండింగ్ యూత్ ఆచీవ్‌మెంట్ అవార్డును నిహాల్ తమ్మనకి, కమ్యూనిటీ సర్వీస్ అవార్డును బాలాజీ ప్రకాశ్ రావుకు, ప్రొఫెషనల్ ఎక్సెలెన్స్ అవార్డు డా. బాలదేవిశెట్టికి, శ్రీమతి సత్యవతి పోచిరాజుకు లిటరరీ ఎక్సెలెన్స్ అవార్డును అందించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలు సాహిత్య వింజమూరి మరియు మధు నెక్కంటి తమ వాక్చాతుర్యంతో అందరినీ కట్టిపడేసేలా నిర్వహించారు. విందు భోజనం అందరికీ సరిపడా చక్కగా ఏర్పాట్లు చేశారు.
Tags :