ASBL Koncept Ambience

పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్

పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్

అయుత మహా చండీ యాగం మూడవరోజు కార్యక్రమం గురు ప్రార్థనతో ప్రారంభమయింది.  ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు యాగశాల ప్రవేశం చేశారు. గురుప్రార్థనలో భాగంగా శృంగేరీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ భారతీ తీర్ధ స్వామి వారికి ''వందే గురు పరంపర'' అంటూ రుత్విజులు పఠనం చేస్తుండగా  ముఖ్యమంత్రి గురువుకు సాష్టాంగ ప్రమాణం చేశారు. సప్తశథీ పారాయణం ప్రారంభించే ముందు పూర్వాంగం కార్యక్రమం నిర్వహించారు. ఇందులో అ:తర మాతృకన్యాసాలు, బహిర్‌ మాతృకన్యాసాలు, చండీ  కవచం, అర్గళ కీలక పఠనం, ఏకాదశిన్యాసాలు నిర్వహించారు. శరీరంలో అమ్మవారిని ఆవాహన చేసుకునేందుకు రుత్విజులు పాటించే సంప్రదాయ కార్యక్రమమిది. 

యాగశాల ప్రాంగణాన్ని చామంతి, బంతి పూలతో ప్రత్యేకంగా అలంకరించి ఆకర్షణీయంగా మార్చారు.  గురు ప్రార్థన, పూర్వాంగం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు యాగశాలను కలియతిరిగి రుత్విజులకు అభివాదం చేశారు. మూడో రోజు కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వచ్చిన శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్‌ స్వామి, శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిలకు ముఖ్యమంత్రి స్వాగతం పలికి, పాదాభివందనం చేశార. వారిద్దరూ ముఖ్యమంత్రిని ఆశీర్వదించారు. తెలంగాణ  శాసనమండలి చైర్మన్‌ స్వామి గౌడ్‌, ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి చైర్మన్‌ చక్రపాణి, ఆంధ్రప్రదేశ్‌ స్పీకర్‌ కొడెల శివప్రసాద్‌ రావు, తెలంగాణ మంత్రులు టి. హరీష్‌ ఆరవు, కె. తారకరామారావు, ఇంద్రకరణ్‌ రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, చందూలాల్‌, టూరిజం కార్పోరేషన్‌ చైర్మన్‌ పేర్వారం రాములు, మీడియా సంస్థల అధిపతులు గిరీష్‌ సంఘీ, గౌతమ్‌, వి. రాధాకృష్ణ, శైలజా కిరణ్‌, పలువురు అధికార, అనధికార ప్రముఖులు హాజరయ్యారు. 

Click here for Event Gallery


 

Tags :